
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతోది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారం పర్వంలో మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ కుమార్ యాదవ్ బరిలో నిలిచారు. ప్రచార పర్వంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సింగర్ కమ్ హీరో రాహుల్ సిప్లిగంజ్ నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా నిలిచాడు. నవీన్ అన్న చాలా మంచోడని, గెలిపించాలని కోరాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
‘నవీన్ యాదవ్ అన్న చాలా మంచోడు. ఇంజినీరింగ్ చేసిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. అలాంటిది కఠినమని తెలిసి కూడా నవీన్ అన్న రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌ను బాగా అభివృద్ధి చేస్తాడు. ఉన్న క్యాండిడేట్స్‌లో నవీన్ అన్నే బెస్ట్ లీడర్’ అని వీడియోలో చెప్పుకొచ్చారు రాహుల్ సిప్లిగంజ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
ఇంజినీర్ చదివిన…
విద్యావంతుడు నవీన్ అన్న…అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే…
జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తాడు…—– రాహుల్ సిప్లిగంజ్ #NaveenYadav #JublieeHills #Congress pic.twitter.com/TM1ZF8BaN7
— Congress for Telangana (@Congress4TS) October 25, 2025
కాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు నవంబర్ 11న పోలీంగ్ జరగనుంది. 14న కౌంటింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. అలాగే భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి