
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేశారు డాక్టర్స్. ఇటీవల షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తారక్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ భుజానికి గాయం అయ్యింది. ఈ రోజు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్‌లో తారక్ కు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
డా. ఆర్‌ఎ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్‌రావు, డా. శ్రీనివాస్‌రావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతం అయ్యిందని, ప్రస్తుతం ఎన్.టి.ఆర్ వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా ఉన్నారని, 2 నుంచి 3 నెలల్లో పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తారని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కిమ్స్ మెడికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ హెచ్‌ఓడీ డా. సంబిత్ సాహు ఎన్టీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.