నందమూరి వంశంలో అన్న ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేస్తే.. అగ్రతారగా వెలుగొందుతున్నారు బాలయ్య. తండ్రి మాదిరిగానే విభిన్నత ఉన్న సినిమాలు చేస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. ఇక బాలయ్య తర్వాత మూడవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ టాప్ లెవల్‌కి చేరారు. తాతగారి రూపంతో పాటు నటనా కౌశల్యాన్ని పుణికి పుచ్చుకున్న తారక్.. ఇప్పుడు భారతదేశంలో అత్యత్తమ నటుల్లో ఒకరిగా కీర్తిని అందుకుంటున్నాడు. అయితే బాలయ్యకు.. ఎన్టీఆర్‌కు మధ్య విబేధాలు ఉన్నాయంటూ నిత్యం వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఫ్యామిలీలో తనకు బాల బాబాయ్ అంటే చాలా ఇష్టమని తారక్ చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. బాలయ్య కూడా ఎన్టీఆర్‌ని చాలా సందర్బాల్లో దగ్గరికి తీసుకున్నారు. అయినా కానీ వారి మధ్య గ్యాప్ ఉందన్న వార్తలు మాత్రం ఆగవు. అందుకు కారణం కొన్ని ఘటనలు..
ఉదాహారణకు… ఈ ఏడాది జనవరిలో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా… హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించారు. తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. ఆ తర్వాత బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. అయితే ఘాట్ వద్ద సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు హరికృష్ణ, కల్యాణ్ రామ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలని జూ.ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే బాలకృష్ణ కారెక్కి అలా వెళ్లారో లేదో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందని.. బాలయ్య చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం జరిగింది.
అయితే బాలయ్యతో గ్యాప్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారో గతంలో నాన్నకు ప్రేమతో సినిమా ప్రమోషన్స్ సమయంలో జగపతిబాబు వివరించారు. బాలయ్యది మీది ఏంటి ఇష్యూ అని జగపతిబాబు తారక్‌ని ప్రశ్నించారట. “నాకేంటి అండీ ఆయనతో ప్రాబ్లమ్. నాకు ఏ సమస్యా లేదు. అసలు ప్రాబ్లం ఏంటి అనేది నాకు తెలీదు. మా నాన్నగారి బ్రదర్ ఆయన. నాకు తండ్రి లాంటి వారు. ఆయనతో నాకేం గొడవ ఉంటుంది. నేనెందుకు మనసులో పెట్టుకుంటాను. నేను ఏ విషయంలోనైనా ఓపెన్‌గానే ఉంటాను” అని జూనియర్ ఎన్టీఆర్ సమాధానమిచ్చారట. ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.