దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ఎన్టీఆర్. ఈ మూవీలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనకు ప్రపంచం ఫిదా అయ్యింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో జపాన్‌లో సందడి చేశారు ఎన్టీఆర్. అక్కడ అభిమానులు చూపించిన ప్రేమకు తారక్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తారక్ తన తదుపరి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ మూవీ చేయనున్నారు. NTR30 వర్కింగ్ టైటిల్ తో రాబో తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా తారక్ న్యూలుక్ నెట్టింట వైరలవుతుంది. ఎన్టీఆర్ క్లాసీ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సూపర్ స్టైలీష్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రముఖ అడ్వర్టైజింగ్.. సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తన సోషల్ మీడియాలో ఖాతాలో జూనియర్ ఎన్టీఆర్ క్లాసీ లుక్ షేర్ చేశారు. అయితే అందులో తారక్.. మరింత స్టైలీష్ గా కనిపిస్తున్నారు. గ్లాసెస్.. సూట్లో అదరగొట్టాడు. యంగ్ టైగర్ న్యూలుక్ నెట్టింటిని షేక్ చేస్తుంది.
ఇక ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీనే కాకుండా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రీలుక్ అంచనాలను పెంచేసింది.
Man of the Masses… looking dapper with the glasses!! ??#PostPackUpShot@tarak9999 pic.twitter.com/3jPDpBLKHg
— Avinash Gowariker (@avigowariker) November 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.