
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 2011 లో విడుదలైన “నువ్విలా” లో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించారు. ఆతర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు. ఇక సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ యాక్షన్ హీరోగా కనిపించారు. ఈ సినిమా తర్వాత, విజయ్ గీత గోవిందం, నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి విజయవంతమైన చిత్రాలో నటించారు.ఇక ఇప్పుడు విజయ్ తన vd 12 సినిమాలో నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ 12వ చిత్రం అయిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. విజయ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు మేకర్స్. ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా టీజర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫిబ్రవరి 12న విజయ్ దేవరకొండ టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నారు.
కాగా ఈ టీజర్ ను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ టీజర్ ను స్టార్ హీరోల వాయిస్ తో రిలీజ్ చేయనున్నారు. తెలుగులో విజయ్ సినిమా టీజర్ కు తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వనున్నారు. రీసెంట్ గా ఈ విషయాన్నీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అలాగే తమిళ్ లో సూర్య వాయిస్ ఇవ్వనున్నారు. అలాగే హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఇవ్వనున్నారు.
A fun banter with my dearest @tarak9999 anna 🤎♥️
Thank you for always having my back whenever I need you anna. Your voice is a force that will elevate the emotions of #VD12 Teaser to another level 🤗🤗🤗 Can’t wait for tomorrow 🔥🔥 pic.twitter.com/F4l8XnyBfl
— Naga Vamsi (@vamsi84) February 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి