Jayasudha: అజిత్ సినిమాల్లో అందుకే నటించలేదు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

|

Jan 31, 2023 | 12:27 PM

తల్లి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆమె అద్భుతనటనతో పాత్రాలు ప్రాణం పోస్తున్నారు జయసుధ. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ ఆమె తల్లిగా నటించి మెప్పించారు.

Jayasudha: అజిత్ సినిమాల్లో అందుకే నటించలేదు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్
Ajith, Jayasuda
Follow us on

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించిన జయసుధ సహజ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలనాటి మేటి హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు తల్లి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆమె అద్భుతనటనతో పాత్రాలు ప్రాణం పోస్తున్నారు జయసుధ. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ ఆమె తల్లిగా నటించి మెప్పించారు. ఇటీవలే ఆమె దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాలో విజయ్ కు తల్లిగా నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటికే చాలా మంది హీరోలకు తల్లిగా నటించిన ఆమె అజిత్ కు మాత్రం తల్లిగా నటించలేదు. అజిత్ సినిమాల్లో నటించకపోవడం పై యాంకర్ ఆడిన ప్రశ్నకు జయసుధ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

జయసుధ మాట్లాడుతూ.. అజిత్ కు తల్లిగా నటించక పోవడానికి ప్రత్యేక కారణాలు ఏవీ లేవు. మొన్నామధ్య ఒక సినిమాలో అజిత్ కు తల్లిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా కూడా ప్రారంభం అయ్యింది. కానీ కరోనా వల్ల ఆ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కరోనా భయంతో నేను షూటింగ్ కు వెళ్ళలేదు. అలా ఆ ఛాన్స్ మిస్ అయ్యాను.

అజిత్ తల్లిగా నటించడానికి ను ఎప్పుడూ రెడీనే.. అవకాశం వస్తే తప్పకుండా చేస్తా అని అన్నారు జయసుధ. ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు జయసుధ. మరి త్వరలోనే అజిత్ సినిమాలో జయసుధ నటిస్తారేమో చూడాలి.