
ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని ఇప్పటికే తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. విజువల్‌గా అద్భుతమైన, వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. లెజెండరీ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శ్రీను&మంగా పాత్రలని పరిచయం చేస్తూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.
శ్రీను అండ్ మంగా ఈవెంట్ లో హీరో జయకృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ.. తాతయ్య కృష్ణ గారు నాకు దేవుడితో సమానం. ఆయనపై నాకు ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. ‘శ్రీనివాస మంగాపురం’ నా తొలి చిత్రం. అజయ్ భూపతి గారు ఈ కథ చెప్పినప్పుడు ఇందులో ఉన్న ఎమోషన్స్, నా పాత్రలోని డెప్త్ నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఈ క్యారెక్టర్ ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని, నటుడిగా నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని భావించాను. అజయ్ భూపతి గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమాకే ఆయనలాంటి దర్శకుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. దత్తు గారు మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేష్ బాబు గారితో ‘రాజకుమారుడు’ చేశారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను.
హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. మా డీవోపీ జై కృష్ణ గారు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలోని పాటలన్నీ బ్లాక్‌బస్టర్ అవుతాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. జీవీ ప్రకాష్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. రాషా అద్భుతమైన నటి. అలాగే చాలా మంచి మనిషి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. మోహన్ బాబు గారు, నరేష్ గారు వంటి లెజెండరీ నటులతో కలిసి నటించడం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమాను మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. నేను మహేష్ బాబాయ్‌కు డైహార్డ్ ఫ్యాన్‌ని. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను ఆయనే లాంచ్ చేశారు. ఎప్పటికప్పుడు నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్యూ సో మచ్ బాబాయ్. ఈ సందర్భంగా మా నాన్నగారు రమేష్ బాబు గారిని తలుచుకుంటున్నాను అంటూ స్పీచ్ అరడగొట్టేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి