Janhvi Kapoor: ఆ విషయంలో ట్రోల్స్ రానందుకు సంతోషంగా ఉంది.. ఎన్టీఆర్‏తో రొమాంటిక్ సాంగ్ పై జాన్వీ కామెంట్స్..

ఇటీవల కొద్ది రోజుల క్రితం విడుదలైన దేవర రెండో సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో జాన్వీ కపూర్ అందాలకు, తారక్ స్టైలీష్ లుక్స్ కు అడియన్స్ ఫిదా అవుతున్నారు. చాలా కాలం తర్వాత తారక్ స్టైలీష్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్, జాన్వీ జోడి బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటపై జాన్వీ కపూర్ స్పందించింది. చుట్టమల్లే పాటకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.

Janhvi Kapoor: ఆ విషయంలో ట్రోల్స్ రానందుకు సంతోషంగా ఉంది.. ఎన్టీఆర్‏తో రొమాంటిక్ సాంగ్ పై జాన్వీ కామెంట్స్..
Janhvi Kapoo
Follow us

|

Updated on: Aug 10, 2024 | 2:03 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల కొద్ది రోజుల క్రితం విడుదలైన దేవర రెండో సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో జాన్వీ కపూర్ అందాలకు, తారక్ స్టైలీష్ లుక్స్ కు అడియన్స్ ఫిదా అవుతున్నారు. చాలా కాలం తర్వాత తారక్ స్టైలీష్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్, జాన్వీ జోడి బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటపై జాన్వీ కపూర్ స్పందించింది. చుట్టమల్లే పాటకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ చుట్టమల్లే సాంగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

చుట్టమల్లే పాటకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపింది జాన్వీ కపూర్. ఈ పాట విషయంలో తనపై ఎలాంటి నెగిటివ్ రోల్స్ రాలేదని.. ఆ విషయంలో మాత్రం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. తన డాన్స్ తోపాటు ఎన్టీఆర్ తో తన కెమిస్ట్రీ అందరికీ నచ్చిందని.. ఈ పాటకు సోషల్ మీడియాలో అభిమానులు చేస్తున్న రీల్స్ ను ఆమె రోజు తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ వారిని అభినందిస్తుంది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో చుట్టమల్లే సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు మరిన్ని రోజుల్లో రానున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదలైన చుట్టమల్లే పాట ఇప్పటివరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.