YS Sharmila: తారకరత్న భార్యకు షర్మిలక్క బిగ్ సర్‌ప్రైజ్‌ !! ఆనందంతో భావోద్వేగానికి లోనైన అలేఖ్య..

నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి కుంగిపోయారు. తన భర్త జ్ఙాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తనను ఓదార్చేందుకు.. తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసేందుకు షర్మిల ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెలో అంతులేని ధైర్యాన్ని నింపారు. ఆగస్టు 08 అలేఖ్యా రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

YS Sharmila: తారకరత్న భార్యకు షర్మిలక్క బిగ్ సర్‌ప్రైజ్‌ !! ఆనందంతో భావోద్వేగానికి లోనైన అలేఖ్య..

|

Updated on: Aug 10, 2024 | 12:16 PM

నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి కుంగిపోయారు. తన భర్త జ్ఙాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తనను ఓదార్చేందుకు.. తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసేందుకు షర్మిల ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెలో అంతులేని ధైర్యాన్ని నింపారు. ఆగస్టు 08 అలేఖ్యా రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. అలేఖ్యకు ఒక సర్ ప్రైజ్ ఇచ్చారు. తన కుమార్తె అంజలితో కలిసి అలేఖ్య పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇంటి కెళ్లి కేక్ కట్ చేయించి బర్త్ డే విషెస్ చెప్పారు. దీంతో తారకరత్న సతీమణి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చూసిన షర్మిల ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను అలేఖ్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. గత కొన్నేళ్లుగా తన పక్కన ఉంటానని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న షర్మిలక్కకు థాంక్స్ చెప్పారు అలేఖ్య. అంతేకాదు తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసినందుకు ఎమోషనల్ అయ్యారు. షర్మిల చేసిన చిన్న పని కూడా తనకు దీవెనలా అనిపిస్తోందని తన పోస్టులో రాసుకొచ్చారు. షర్మిల స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరని.. లవ్ యూ అక్కా.. అంటూ ఆమె మీదున్న ప్రేమను తన పోస్టుతో అందరికీ తెలిసేలా చేశారు అలేఖ్య.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంపర్‌ ఆఫర్‌ వస్తే.. ఎడం కాలితో తన్నిన జగతి మేడమ్

Explainer: మందు బాబులకు గుడ్ న్యూస్ !! కొత్త మద్యం పాలసీలో

TOP 9 ET News: చై- శోభిత ఎంగేజ్‌మెంట్..సామ్ ఇన్ డైరెక్ట్‌ రియాక్షన్

 

Follow us