Janhvi Kapoor: జాన్వీ పాప బర్త్‌డే స్పెషల్‌.. ఫస్ట్‌ లుక్‌ చూశారా?

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ పుట్టినరోజు నేడు. జాన్వీ పుట్టున రోజు సందర్భంగా అభిమానులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్తున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్‌ రాం చరణతో త్వరలో తెరకెక్కనున్న కొత్త మువీలో జాన్వీ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది..

Janhvi Kapoor: జాన్వీ పాప బర్త్‌డే స్పెషల్‌.. ఫస్ట్‌ లుక్‌ చూశారా?
Janhvi Kapoor's first look from RC 16

Updated on: Mar 06, 2025 | 4:44 PM

అందాల తార జాన్వీ కపూర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ జంటగా RC16లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన మూవీతో బాక్సాఫీస్ షేక్ చేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. మార్చి 6 జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా RC 16 టీం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. జాన్వీ కపూర్‌కు శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ సెట్ నుంచి ఆమె స్టిల్‌ను రిలీజ్ చేశారు. అయితే ఇది బిహైండ్ ది సీన్‌కు సంబంధించిన స్టిల్ మాత్రమేనని.. ఇది అఫీషియల్ లుక్ కాదని టీం క్లారిటీ ఇచ్చింది. మొదటి షెడ్యూల్ సమయంలో మైసూర్‌లో క్లిక్ చేసిన సాధారణ ఫోటో అని స్పష్టం చేశారు.

జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ చూస్తే.. అంతా మెస్మరైజ్ అవుతారని టీం అంచనాలు పెంచేసింది. నవంబర్ 2024లో మైసూర్‌లో జరిగిన మొదటి షెడ్యూల్‌లో జాన్వీ కపూర్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో గురువారం ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లోనూ జాన్వీ కపూర్ పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ 12 రోజుల పాటు కొనసాగుతుంది. హీరో, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మువీలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు విజువల్స్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు RC16ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.