టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న రాయ దుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు.. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనిషేక్ జానీని ఆదేశించింది జనసేన.. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది.
తన అసిస్టింట్ తో తప్పుగా ప్రవర్తించాడని జానీ మాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపించింది. జానీ మాస్టర్ పై సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ అయిన ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు చోట్ల ప్రచారం కూడా చేశాడు.