‘అవతార్ 2’ పై కీలక అప్డేట్

|

Sep 28, 2020 | 7:27 PM

 'అవతార్'​..ఈ సినిమాకు ప్రపంచ సినిమా చరిత్రలో ప్రత్యేక పేజీ ఉంది. విజువల్ వండర్ గా ఈ సినిమాను అభివర్ణిస్తారు.

అవతార్ 2 పై కీలక అప్డేట్
Follow us on

‘అవతార్’​..ఈ సినిమాకు ప్రపంచ సినిమా చరిత్రలో ప్రత్యేక పేజీ ఉంది. విజువల్ వండర్ గా ఈ సినిమాను అభివర్ణిస్తారు.  ‘అవతార్​ 2’​  కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి తాజాగా అప్డేట్ ఇచ్చారు ఆ చిత్ర దర్శకుడు  జేమ్స్ కామెరూన్​.  ‘అవతార్​ 2’​ చిత్రీకరణ పూర్తయ్యిందని​ స్పష్టం చేశారు. ‘అవతార్​ 3’ షూటింగ్ మరో 5 శాతం మిగిలి ఉందని తెలిపారు.  ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా వరల్డ్​ సమ్మిట్​-2020లో హాలీవుడ్​ యాక్టర్ ఆర్నాల్డ్​ ష్క్వార్జ్​నెగ్గర్​​తో జూమ్​ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

“కరోనా వైరస్​ ప్రపంచంలోని ప్రతి రంగాన్ని ఎఫెక్ట్ చేసింది. ముఖ్యంగా సినిమా రంగానికి ఇది భారీ దెబ్బ. దీనివల్ల మా సినిమా  విడుదలను మరో ఏడాది పాటు అంటే 2022కు వాయిదా వేశాం. ప్రస్తుతం న్యూజిలాండ్​లో అవతార్​ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ‘అవతార్​ 2’ షూటింగ్​ కంప్లీట్ అయ్యింది.. ‘అవతార్​ 3’ షూటింగ్ మరో 5 శాతం మిగిలి ఉంది ” అని జేమ్స్​ కామెరూన్​ పేర్కొన్నారు.

Also Read :

RRvsKXIP: క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఫీల్డింగ్, రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

ఎస్పీబీ ఆస్పత్రి బిల్లులపై తప్పుడు ప్రచారం, చరణ్ ఆవేదన