Jagapathi Babu:ఆర్ సీ16పై జగ్గూ భాయ్ అప్డేట్.. రామ్ చరణ్ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో  చూడండి

|

Jan 16, 2025 | 1:01 PM

గతంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతిబాబు ఇప్పుడు విలన్ గా, సహాయక నటుడిగా మెప్పిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటున్నారు. ఇటీవల పుష్ప 2లో ఓ డిఫరెంట్ రోల్‌ లో మెరిసిన జగ్గూ భాయ్ ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ సీ 16 కోసం రెడీ అవుతున్నారు.

Jagapathi Babu:ఆర్ సీ16పై జగ్గూ భాయ్ అప్డేట్.. రామ్ చరణ్ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో  చూడండి
Jagapathi Babu
Follow us on

గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం ఆర్ సీ 16 (వర్కింగ్ టైటిల్). ఉప్పెన’ ఫేమ్​ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు మరొక ప్రధాన పాత్రలో యాక్ట్ చేయనున్నారు. వీరితో పాటు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ మున్నా భయ్యా అలియాస్ దివ్యేందు కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యాడు. ఇప్పటికే ఆర్ సీ 16 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం తర్వా మరోసారి రామ్ చరణ్ సినిమాలో నటించనున్నారు జగపతి బాబు. ఈ చిత్రంలో త‌న పాత్ర మేకోవ‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని గ‌తంలోనే చెప్పుకొచ్చారు జగ్గూ భాయ్. తాజాగా త‌న పాత్ర కోసం మేక‌ప్ వేసుకుంటున్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారీ సీనియర్ యాక్టర్. సంక్రాంతి ముగియడంతో నేటి నుంచే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో జగపతి బాబు కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా జగ్గూ భాయ్ మేకప్ సెట్ చేశారట. ‘చాలా కాలం త‌రువాత బుచ్చిబాబు ఆర్‌సీ 16 కోసం మంచి ప‌ని పెట్టాడు. గెట‌ప్ చూసిన త‌రువాత నాకు చాలా తృప్తిగా అనిపించింది’ అని తన పోస్టులో రాసుకొచ్చారు జగపతి బాబు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

 

ఆర్ సీ 16 సినిమాకు ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజ‌ర్ సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి రోజే ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల‌ను వ‌సూలు చేసింది. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

జగపతి బాబు వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.