Jabardasth Varsha: ఆ సమయంలో ఆయన కాళ్లు పట్టుకొని వేడుకున్నా.. మూడు రోజులు నిద్రలేకుండా గడిపా..

ప్రముఖ నటి, జబర్దస్త్ వర్ష తన వ్యక్తిగత జీవితంలోని పలు కీలక ఘట్టాలను, తీవ్ర భావోద్వేగాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కుటుంబ అనుబంధాలు, ప్రమాదాలు, ఆరోగ్య సవాళ్లు, అలాగే జీవితం పట్ల తన దృక్పథాన్ని ఆమె ఈ సందర్భంగా వివరించారు .

Jabardasth Varsha: ఆ సమయంలో ఆయన కాళ్లు పట్టుకొని వేడుకున్నా.. మూడు రోజులు నిద్రలేకుండా గడిపా..
Jabardasth Varsha

Updated on: May 10, 2026 | 12:26 PM

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో వర్ష ఒకరు. ఓ ఇంటర్వ్యూలో వర్ష మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వర్ష మాట్లాడుతూ.. ప్రతి కుమార్తెకు తండ్రే మొదటి హీరో అని వర్ష పేర్కొన్నారు. తన తండ్రితో కలిసి అన్నవరం, తలుపులమ్మ లోవ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన మధుర జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ జ్ఞాపకాలు తిరిగి రావని, వాటిని చాలా మిస్ అవుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి మరణం తరువాత తన తల్లి ఒంటరిఅయిపోయిందని, ప్రతి పనికీ తండ్రిపై ఆధారపడే తల్లికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని వర్ష తెలిపారు. తల్లి ఆరోగ్యం పట్ల ప్రస్తుతం తమకు తీవ్ర ఆందోళన ఉందని, ఆమెను కాపాడుకోవడానికి తాము చాలా కష్టపడుతున్నామని తెలిపింది. అలాగే వర్ష జీవితంలో ఒక ముఖ్యమైన, ఆందోళనకరమైన సంఘటన తన చిన్నన్నయ్యకు జరిగిన ప్రమాదం.

ఇది కూడా చదవండి : వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

సంక్రాంతి ఈవెంట్ సమయంలో తన అన్నయ్య ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో ఆయన తలకు గాయం కావడంతో, మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు తెలిపారు. ఈ వార్త వినగానే తాను హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లి, వెంటనే అన్నయ్యను హాస్పిటల్ లో చేర్చానని వర్ష చెప్పారు. వైద్యులు అన్నయ్య బ్రతకడం కష్టం అని చెప్పినప్పుడు, తాను డాక్టర్ కాళ్లు పట్టుకొని, ఎంత ఖర్చయినా పర్లేదు, ఎక్కడికైనా తీసుకెళ్లండి, నా అన్నయ్య బ్రతకాలి అని వేడుకున్నానని తెలిపింది. అన్నయ్య ఐసీయూలో ఉన్న ఆ మూడు రోజులు తాను హాస్పిటల్ బయట కాలువ పక్కన కూర్చుని గడిపానని, నిద్రపోకుండా అన్నయ్య కోసం ఎదురు చూశానని చెప్పారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి, తండ్రి మరణం కారణంగా ఈ ప్రమాదం గురించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, వదినకు కూడా తెలియకుండా ఒంటరిగా ఈ భారాన్ని మోశానని వర్ష తెలిపారు. ఆ సమయంలో నటి రోజా తనకు అండగా నిలిచి, “ఏమీ టెన్షన్ పడకు వర్షా, మేము ఉన్నాం” అని ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. మూడవ రోజుకు అన్నయ్యకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినప్పుడు, వారి కాళ్ళు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పిన క్షణాలను వర్ష వివరించారు.

ఇది కూడా చదవండి :OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్

అయితే తన అన్నయ్యను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన కొన్ని గంటలకే వర్షకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ వార్త వినగానే ఎక్స్‌ట్రా జబర్దస్త్ , పోవే పోరా వంటి షోలలో తనతో పనిచేసే సహచరులు భయపడ్డారని ఆమె గుర్తుచేసుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి జీవితం గురించి, దాని విలువను తనకు నేర్పించిందని వర్ష తెలిపారు. ఎప్పుడు ఎవరూ ఉంటారో, ఎప్పుడు పోతారో తెలియని ఈ జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదించాలని, పూర్తి ఆనందంతో గడపాలని వర్ష చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us