
జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ శుభవార్త చెప్పాడు. బుల్లితెరపై హిలేరియస్ కామెడీ పంచులతో నవ్వించే ఈ కమెడియన్ త్వరలో తండ్రి గా ప్రమోషన్ పొందనున్నాడు. ప్రవీణ్ భార్య కడెం వంశిత ప్రస్తుతం గర్బంతో ఉంది. ఈ శుభవార్తను స్వయంగా ప్రవీణ్ భార్య వంశితనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఓ అందమైన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారీ జబర్దస్త కపుల్. అందులో తాను తల్లి కాబోతున్నట్టు ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్ ని ప్రవీణ్ కి చూపించింది వంశిత. దీంతో ప్రవీణ్ ఆనందంతో ఆమెను హత్తుకుని ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత ఆమె తల్లికి కూడా ఈ శుభవార్తను చెప్పడం, ఆమె కూడా వంశితను హత్తుకోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ప్రవీణ్-వంశిత దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా ఈ ఏడాది మేలో ప్రవీణ్- కడెం వంశితలు పెళ్లిపీటలెక్కారు. అంతకు ముందు చాలా రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. సింపుల్ గా ఓ గుడిలో వీరి వివాహం జరిగింది. పలువురు జబర్దస్త్ సెలబ్రిటీలు, బుల్లితెర తారలు ప్రవీణ్- వంశితల వివాహానికి హాజరయ్యారు. వీరికి సంబంధించిన పెళ్లి ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇప్పుడు తమ అన్యోన్యమైన ప్రేమ బంధానికి ప్రతీకగా ఓ పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు ప్రవీణ్- వంశిత.
కాగా పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు ప్రవీణ్. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు ప్రవీణ్. ఇక కడెం వంశిత నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.