
ప్రముఖ హాస్యనటుడు తిరుపతి ప్రకాష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు వేణు మాధవ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. వేణు మాధవ్ మరణించిన సమయంలో ఎదురైన వ్యక్తిగత విషాదం గురించి మాట్లాడుతూ, “వేణు చనిపోయినప్పుడు ఆయన చూడలేకపోయాను నేను. అదే టైంలో మా అమ్మగారు ఏప్రిల్ 14న పోయారు. అన్న ఏప్రిల్ 27 లేదా 28న చనిపోయారు, సేమ్ ఇయర్,” అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి సంబంధించిన 10వ రోజు కార్యక్రమాల నిమిత్తం కర్ణాటకలో ఉండటం వల్ల ప్రియమైన స్నేహితుడికి చివరి వీడ్కోలు పలకలేకపోయానని తెలిపారు. తన పూర్వీకులు కర్ణాటకకు చెందినవారని, బళ్లారి, అనంతపూర్, బెంగళూరు, మైసూర్, హిందూపూర్ లలో తన బంధువులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
వేణు మాధవ్ ను గొప్ప వ్యక్తిత్వమున్న స్నేహితుడిగా తిరుపతి ప్రకాష్ అన్నారు. “ఎప్పుడు ప్రతి పండక్కి, ప్రతి దీనికి బర్త్ డేకు అన్న మెసేజ్ పెట్టేవాడు. హ్యాపీ బర్త్డే రా బండా అనేవాడు, ప్రకాష్ అని పెట్టేవాడు,” అని వేణు మాధవ్ ఆప్యాయతను పంచుకున్నారు. అప్పటి రోజుల్లో సెల్ ఫోన్లు లేకపోయినా, మేనేజర్లు ఇంటికి వచ్చి అవకాశాలు గురించి చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. వేణు మాధవ్ తనతోపాటు ఇతర నటులకు అవకాశాలు ఇప్పించడంలో ఎంతో ఉదారంగా ఉండేవారని ప్రకాష్ వివరించారు. “ఒకవేళ వేణన్నని నేను పిలిస్తే సార్ నాతోపాటు ఇంకెవరున్నారు సార్ ఆర్టిస్టులు? అంటే ఇంకా లేదు వేణు అనుకుంటున్నాం. సార్ మన ప్రకాష్ ఉన్నాడు సార్. మన గణేష్ ఉన్నాడు సార్, చెప్పండి,” అంటూ తనను, బండ్ల గణేష్ ను ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నారు. ఈ స్నేహపూర్వక బంధాల కారణంగానే దాదాపు 30-37 చిత్రాలలో హీరో స్నేహితుడి పాత్రలలో నటించగలిగానని ప్రకాష్ తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో మహేష్ బాబు తో సహా, ఆ జనరేషన్ లోని ఎన్టీఆర్ మినహా శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, కళ్యాణ్ బాబు, రాజేంద్రప్రసాద్, నరేష్ వంటి దిగ్గజాలందరితో కలిసి పనిచేశానని తిరుపతి ప్రకాష్ పేర్కొన్నారు. పాత తరం సినీ పరిశ్రమ వాతావరణాన్ని, తోటి కళాకారులతో ఉన్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు అసోసియేట్ డైరెక్టర్లు తమ నటనను మెచ్చుకుంటూ “అన్నా ఇవాళ ఇరగదీశావన్న సీన్,” అని ప్రశంసించేవారని తెలిపారు. తాను కూడా వారికి తన ఏసీ గదిలో విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించేవారట. ఆ అసోసియేట్ డైరెక్టర్లలో కొందరు ఈనాడు పెద్ద దర్శకులు అయ్యారని, మరికొందరు కనుమరుగయ్యారని ప్రకాష్ చెప్పుకొచ్చారు. అప్పటి రోజుల్లో డైరెక్టర్లను కలవడం సులువుగా ఉండేదని, ఇప్పుడు దర్శకులను కలవడం వెంకటేశ్వరస్వామి దర్శనం కంటే కష్టమైపోయిందని ఆయన ప్రస్తుత పరిస్థితిపై నిరాశ వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..