Jabardasth Dhanraj: పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతిలో పెట్టారు: జబర్దస్త్ ధనరాజ్

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ధనాధన్ ధన్ రాజ్ ఒకరు. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. అయితే కెరీర్ ప్రారంభంలో అవకాశాల్లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ధనరాజ్.

Jabardasth Dhanraj: పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతిలో పెట్టారు: జబర్దస్త్ ధనరాజ్
Jabardasth Actor Dhanraj

Updated on: Aug 27, 2026 | 7:33 PM

ధనరాజ్.. ఈ టాలీవుడ్ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు పిల్ల జమిందార్, భీమిలి కబడ్డీ, జగడం వంటి పలు తెలుగు హిట్ సినిమాల్లో కమెడియన్ గా చేసిన ఇతను జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ సాధారణ కంటెస్టెంట్ గా ఈ కామెడీ షోలోకి అడుగు పెట్టిన ధన్‌రాజ్ తన కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. ‘ధనా ధన్ ధన్‌రాజ్’ పేరుతో ఇతను చేసే కామెడీ స్కిట్లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యూట్యూబ్ లోనూ ఈ కమెడియన్ స్కిట్స్ కు భారీగా వ్యూస్ వస్తుంటాయి. కేవలం టీవీ షోల్లోనే కాదు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు ధన్‌రాజ్. బుజ్జి ఇలారా వంటి సినిమాల్లో హీరోగా ఆకట్టుకన్న ధన్‌రాజ్ రామం రాఘవం సినిమాతో డైరెక్టర్ గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. సముద్ర ఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యినా కంటెంట్ పరంగా మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే ధన్ రాజ్ మేకింగ్ పై కూడా ప్రశంసలు వచ్చాయి. అయితే చాలా మంది లాగే కెరీర్ ప్రారంభంలో పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇక్కట్లు పడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఓ హీరో, పాన్ ఇండియా డైరెక్టర్ తనను ఆదుకున్నారని ఎమోషనల్ అయ్యాడీ జబర్దస్త్ కమెడియన్.

‘పెళ్లి తర్వాత నాకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. కుటుంబాన్ని పోషించడం కష్టమైపోయింది. దీంతో ఎవరినైనా సాయం అడగాలనుకున్నా. అప్పుడు వెళ్లి హీరో రామ్ గారిని సాయం అడిగా. ఆయన వెంటనే 10 వేల రూపాయల చెక్ రాసి ఇచ్చారు. అప్పుడు జగడం సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో 10 వేలు అంటే నాకు 10 లక్షలతో సమానం. డబ్బు ఇచ్చాక రామ్ గారు నాతో ఒకే మాట అన్నారు. 10 వేలు మాత్రమే కాదు.. నీకు ఎలాంటి సాయం కావాలన్నా సిగ్గులేకుండా నన్ను అడగమన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో నన్ను ఆదుకున్న మరో వ్యక్తి డైరెక్టర్ సుకుమార్ గారు. ఒకసారి ప్రసాద్ లాబ్స్ లో ఆయనను కలిశాను. అప్పటికీ నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానని ఆయనకి తెలుసు. వెంటనే తన జేబులో ఎంత డబ్బు ఉందో కూడా లెక్కపెట్టకుండా నాకు ఇచ్చేశారు. ఈ డబ్బుతో ఇంట్లో అందరికీ మంచి బట్టలు ఇంకా అవసరమైనవి కొనుక్కుని వెళ్లు అని చెప్పారు. వాళ్లు నాపై చూపించిన ప్రేమకు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పటికీ నేను పెద్ద స్టార్ ను కూడా కాదు. వాళ్లు నాపై కేర్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. అయినా నన్ను ఆదుకున్నారు. అందుకే ఎలాగైనా సుకుమార్, రామ్ ఇద్దరి రుణం తీర్చుకోవాలనుకున్నా. ఆ టైంలోనే నాకు కొడుకు పుట్టాడు. 21 రోజుల తర్వాత సుకుమార్, రామ్ పేర్లు కలిసి వచ్చేలా మా బాబుకి సుఖ్ రామ్ అని పేరు పెట్టాను’ అని ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Sukumar, Ram Pothineni

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us