Naga Chaitanya- Sobhita Dhulipala: గ్రాండ్‌గా అక్కినేని నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌

|

Aug 08, 2024 | 1:31 PM

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది.  ఉదయం 9.42కి ఎంగేజ్‌మెంట్ జరిగింది.  నటి శోభితా ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్‌మెంట్.  నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరిగాయి. కొద్ది నెలల కిందట ఫారిన్‌ వేకేషన్‌లో కలిసి కనిపించింది ఈ జంట. అప్పట్నుంచే ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

Naga Chaitanya- Sobhita Dhulipala: గ్రాండ్‌గా అక్కినేని నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్‌
Naga Chaitanya Sobhita Dhul
Follow us on

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది.  ఉదయం 9.42కి ఎంగేజ్‌మెంట్ జరిగింది.  నటి శోభితా ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్‌మెంట్.  నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరిగాయి. కొద్ది నెలల కిందట ఫారిన్‌ వేకేషన్‌లో కలిసి కనిపించింది ఈ జంట. అప్పట్నుంచే ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేశారు నాగార్జున నాగార్జున

2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా  చైతన్య – సమంత ప్రకటించారు. నాగచైతన్య-సమంత విడిపోయిన నాటి నుంచే చైతూ-శోభిత ధూళిపాళ్లపై రూమర్స్‌ వచ్చాయ్‌. శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్‌ చేస్తున్నట్టు న్యూస్‌ వైరల్‌ అయ్యింది. అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి ఉన్న వెకేషన్‌ పిక్స్‌ బయటికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ పూర్తయ్యింది.

2013లో ఫెమినా మిస్‌ ఇండియా ఎర్త్‌ టైటిల్‌ విన్నర్‌ అయిన శోభిత ధూళిపాళ్ల.. ఆ తర్వాత 2013 మిస్‌ ఎర్త్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చిన శోభిత… 2016లో తొలిసారి నటించింది. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో రామన్‌ రాఘవ్‌ మూవీలో యాక్ట్‌ చేసింది. ఆ తర్వాత మేడ్‌ ఇన్‌ హెవెన్‌, ది నైట్‌ మేనేజర్‌, మంకీ మ్యాన్‌ వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన పాత్ర పోషించింది శోభిత ధూళిపాళ్ల. తెలుగులోనూ రెండు సూపర్‌ హిట్‌ మూవీస్‌లో నటించింది శోభిత ధూళిపాళ్ల. 2018లో వచ్చిన గూఢాచారి… 2022లో వచ్చిన మేజర్‌ మూవీస్‌లో కీలక పాత్రలు పోషించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.