రన్యా రావు గోల్డ్ కహానీలో ఊహించని ట్విస్ట్.. ఆమెను పట్టించింది ఎవరో తెలుసా.?

రన్యా రావు అరెస్ట్‌ అయ్యారు. బంగారం దొరికింది. ఆమె బండారం బట్టబయలు అయింది. అయితే కథకు ఇక్కడే శుభం కార్డు పడలేదు. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు రన్యా రావు (33) ను మూడు రోజుల పాటు DRI కస్టడీకి పంపింది. విచారణలో రన్యారావు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మరింత లోతైన దర్యాప్తు కొనసాగించనున్నట్టు సమాచారం.

రన్యా రావు గోల్డ్ కహానీలో ఊహించని ట్విస్ట్.. ఆమెను పట్టించింది ఎవరో తెలుసా.?
Ranya Rao

Updated on: Mar 11, 2025 | 3:05 PM

రన్యా రావు .. దేశవ్యాప్తంగా హాట్‌హాట్‌ డిస్కషన్‌గా మారింది ఈ హీరోయిన్‌ గోల్డ్‌ కహానీ. ఈ స్మగ్లింగ్‌ ఎపిసోడ్‌లో ఇప్పటిదాకా మీరు చూసింది ఒక ఎత్తు. ఇప్పుడు ఊహించని మలుపు తీసుకుంది ఈకథ. అసలు ఇంతకూ ఈ హీరోయిన్‌ను పట్టించిన హీరో ఎవరు? కన్నడ హీరోయిన్‌ రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో కీలక మలుపు ఇది. రన్యాపై DRI అధికారులకు ఫిర్యాదు చేసింది ఎవరో కాదు.. స్వయంగా ఆమె భర్తనే అని తేలింది.  రన్యా విదేశీ టూర్లతో ఆమె అత్తగారింట్లో గొడవలు జరిగాయని తెలుస్తుంది.  పెళ్లయిన 2 నెలల తర్వాతనుంచి విదేశీ టూర్లు మొదలుపెట్టింది రన్యా. భార్య మీద అనుమానం వచ్చి DRI అధికారులకు భర్త ఫిర్యాదు చేశారు.

కాగా రన్యారావు కదలికల మీద 6 నెలలపాటు నిఘాపెట్టారు DRI అధికారులు. ఒకేరోజులో ఆమె దుబాయ్‌కి వెళ్లిరావడాన్ని గుర్తించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదులో గోల్డ్‌స్మగ్లింగ్‌ కేసులో రన్యా అరెస్ట్‌ అయ్యింది. రన్యారావు కేసులో IPS అధికారి పాత్రపై రాష్ట్ర హోంశాఖ ఫోకస్‌ పెట్టింది. ఈ కేసులో IPS రామచంద్రరావు పేరును వాడుకుంది రన్యా . ఎయిర్‌పోర్టులోని ప్రోటోకాల్‌ ప్రాంతాన్ని గోల్డ్‌ స్మగ్లింగ్ కోసం వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు చేయాలని హోంశాఖ ఆదేశించింది. ఇందుకోసం దర్యాప్తు అధికారిగా గౌరవ్‌ గుప్తా నియమించారు. వారంలోగా నివేదిక సమర్పించాలని హోంశాఖ ఆదేశించింది.

ఈ మొత్తం గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో రన్యాకు సహకరించినవారు ఎవరు? ఇప్పుడు ఇదే పాయింట్‌ మీద CBI కూపీ లాగుతోంది. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ తనిఖీల సమయంలో రన్యారావుకు సహకరించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రపై కూడా CBI ఫోకస్‌ చేసింది.మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో దుబాయ్ పర్యటన నుండి తిరిగి వస్తుండగా 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తుండగా రన్యారావును పోలీసులు అరెస్టు చేశారు. రన్యా రావు ఒక సిండికేట్‌లో భాగమని దర్యాప్తులో తేలింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.