Balakrishna: 32 ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో ఆ హీరోయిన్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నందమూరి బాలకృష్ణ. ఇతర హీరోల సినిమాల్లో లేని యాక్షన్ సీన్స్ బాలయ్య సినిమాల్లో ఉంటాయి. ఆయన చిత్రాల కోసమే ప్రత్యేకంగా అడియన్స్ ఊహించని యాక్షన్ సీన్స్ క్రియేట్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. బాలకృష్ణ సినిమా వచ్చిందంటే చాలు.. కామెడీ, సెంటిమెంట్ కాకుండా యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయో చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

Balakrishna: 32 ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో ఆ హీరోయిన్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Balakrishna

Updated on: May 22, 2025 | 7:46 AM

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు.

ప్రస్తుతం అఖండ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య.గతేడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ షేక్ చేశారు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, మహారాజ్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.  గతంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అఖండ 2 గురుంచి నిత్యం సోషల్ మీడియాలో.. ఫిలిం సర్కిల్స్ లో ఎదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా అఖండ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. బాలయ్యకు జోడీగా ఆమె ఎన్నో సినిమాలు చేసింది. బాలయ్య పక్కన హీరోయిన్ గా చేసిన ఆమె ఇప్పుడు అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.