The Raja Saab: ఒకరు కాదు ఇద్దరు.. ‘ది రాజాసాబ్’ను ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా? ప్రభాస్ ఎలా వచ్చాడంటే?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. ప్రభాస్ ఉండడంతో భారీ కలెక్షన్లు వస్తున్నప్పటికీ డార్లింగ్ అభిమానులు మాత్రం ది రాజాసాబ్ సినిమా పట్ల కొంచెం నిరాశకు లోనయ్యారు.

The Raja Saab: ఒకరు కాదు ఇద్దరు.. ది రాజాసాబ్ను ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా? ప్రభాస్ ఎలా వచ్చాడంటే?
Prabhas The Raja Saab Movie

Updated on: Jan 15, 2026 | 3:40 PM

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ది రాజాసాబ్. ఫాంటసీ హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సలార్, కల్కి రేంజ్ లో ది రాజాసాబ్ సినిమా లేదని స్వయంగా ప్రభాస్ అభిమానులే పెదవి విరుస్తుండడం గమనార్హం. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ రికార్డు వసూళ్లు కూడా ప్రభాస్ కారణంగానే అని చెప్పవచ్చు. ఇందులో ప్రభాస్ అద్భుతంగా నటించాడని, డ్యాన్సులు, ఫైట్లలో వింటేజ్ ప్రభాస్ ను చూశామంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా ప్రస్తుతం ‘ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అని మన్ననలు అందుకుంటున్న ప్రభాస్ రేంజ్ కు ఇది సరిపోదంటున్నారు అభిమానులు. . ఈ నేపథ్యంలో రాజాసాబ్ సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ కాదని, ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన తర్వాతే డార్లింగ్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడని నెట్టింట వినిపిస్తోంది.

దర్శకుడు మారుతి ది రాజాసాబ్ సినిమాను మొదట నేచురల్ స్టార్ నానితో చేయాలని అనుకున్నాడట.అందుకు తగ్గట్టుగానే కథను రెడీ చేసుకున్నాడట. అయితే నాని ఈ కథ తనకు సూట్ అవ్వదని చెప్పేశాడట. దీని తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య తో ఈమూవీని చేయాలని ప్రయత్నించాడట మారుతి. అయితే సూర్యకు ఈ కథను వినిపించే అవకాశం రాలేదని తెలుస్తోంది. ఒకవేళ వినిపించి ఉంటే ఆయన ఓకే చేసేవాడా? కాదా? అనే విషయం తెలియదు. అలా మొత్తానికి ఇద్దరు హీరోలు మిస్ అయిన కథను ప్రభాస్ కు చెప్పాడట మారుతి. అయితే డార్లింగ్ ఇందులో కొన్ని మార్పులు సూచించాడట. దీంతో మారుతి ముందనుకున్న కథలో ఆ మార్పులు చేర్పులు చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాడట. అయితే ఇప్పుడీ ది రాజాసాబ్ సినిమాకు డివైట్ టాక్ రావడంతో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రూ. 250 కోట్లకు చేరువలో ది రాజాసాబ్ సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.