Sreeleela: స్టార్ హీరో సినిమానుంచి తప్పుకున్న క్రేజీ బ్యూటీ శ్రీలీల.. కారణం ఇదే.

|

Oct 30, 2023 | 7:27 AM

ఇప్పటికే నేషనల్ క్రాష్ రష్మిక మందన్న టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకుంది. అలాగే మరో బ్యూటీ శ్రీలీల కూడా ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది శ్రీలీల. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు. ఆతర్వాత రవితేజ సరసన ధమాకా అనే సినిమాలో చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

Sreeleela: స్టార్ హీరో సినిమానుంచి తప్పుకున్న క్రేజీ బ్యూటీ శ్రీలీల.. కారణం ఇదే.
Sreeleela
Follow us on

కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. అక్కడ అంతగా రాణించని హీరోయిన్స్ మనదగ్గర మాత్రం స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. ఇప్పటికే నేషనల్ క్రాష్ రష్మిక మందన్న టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకుంది. అలాగే మరో బ్యూటీ శ్రీలీల కూడా ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది శ్రీలీల. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు. ఆతర్వాత రవితేజ సరసన ధమాకా అనే సినిమాలో చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ధమాకా సినిమాతర్వాత శ్రీలీల కు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మంచి సక్సెస్ లు అందుకుంటుంది. ఇటీవలే స్కంద, బగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. వీటిలో స్కంద అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు శ్రీలీల చేతిలో దాదాపు 10 సినిమాల వరకు ఉన్నాయని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం అనే సినిమా చేస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది శ్రీలీల.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ సరసన కూడా శ్రీలీల ఓ సినిమాలో నటించనుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఈ సినిమానుంచి శ్రీలీల తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. వరుస సినిమాలతో బిజీ కావడంతో శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ కాలేదని సమాచారం. దాంతో విజయ్ సినిమాను వదులుకుందట శ్రీలీల. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా గౌతమ్ తెన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీలీల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.