Leo : దళపతి విజయ్ లియో మూవీలో ఈ స్టార్ హీరో కూడా నటిస్తున్నారా..?

చివరిగా విజయ్ వారసుడు సినిమాతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ మూవీకి కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు లియో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు విజయ్.

Leo : దళపతి విజయ్ లియో మూవీలో ఈ స్టార్ హీరో కూడా నటిస్తున్నారా..?
Thalapathy Vijay Leo

Updated on: Jul 27, 2023 | 3:47 PM

దళపతి విజయ్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్స్ అవుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ సినిమాలు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తాయి. చివరిగా విజయ్ వారసుడు సినిమాతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ మూవీకి కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు లియో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు విజయ్. విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ సొంతం చేసుకున్న లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది.

ఇదిలా ఉంటే లియో సినిమా గురించి రోజుకొక వార్త వైరల్ అవుతూ ఉంది. ఈ సినిమా హీరోయిన్ గా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. లియో సినిమాలో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న శివకార్తికేయన్ కూడా నటిస్తున్నాడని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది.

శివ కార్తికేయన్ కు తమిళ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో కూడా శివకార్తికేయన్ కు మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు లియో లో ఆయన నటిస్తున్నాడని వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. లోకేష్ తన లాస్ మూవీ విక్రమ్ లో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య నటించిన విషయం తెలిసిందే.

Sivakarthikeyan