సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కోసం SSMB28. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం.. మహేష్ నుంచి మరో ప్రాజెక్ట్ రాలేదు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోండగా.. కీలకపాత్రలో శ్రీలీల కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య అన్ని కమర్షియల్ హంగులున్న సినిమాగా తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. దాంతో ఈ సినిమాకు చిన్న బ్రేక్ పడింది. వరుసగా అన్న, అమ్మ, నాన్న ఇలా అందరు దూరం కావడంతో మహేష్ ఎంతో మనోవేదనకు గురవుతున్నాడు. ఇక ఇటీవలే మహేష్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
జనవరి 18 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ అని కొందరు.. కాదు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మరోకొంత మంది అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది.
మహేష్ సినిమాలో కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇటీవల రమ్యకృష్ణ చేస్తోన్న పాత్రలు సినిమాలకు హైలైట్ గా నిలుస్తోన్న విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీ గురించి మరో రూమర్ కూడా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..ఈ సినిమాని గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథతో త్రివిక్రమ్ సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తుంది. మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ లో రాజకీయాలు ఫ్యాక్షన్ గొడవలని టచ్ చేస్తూ కథని తెరకెక్కిస్తున్నాడట గురూజీ. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను ఆగస్టు లు రిలీజ్ చేయనున్నారు.