Bigg Boss 6 Telugu : బిగ్ బాస్6 లోకి ఆ జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే..

|

Aug 22, 2022 | 9:14 PM

నాగ్ చెప్పినట్టే... లైఫ్లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే! ఎంటర్‌టైన్మెంట్‌కు అడ్డాగా బిగ్ బాస్ మారిపోయినట్టే.! ఇది ఇప్పుడే కాదు.. బిగ్ బాస్ తెలుగులో ఎంట్రి ఇచ్చినప్పటి నుంచి ఇంతే! బుల్లితెరపై అన్‌లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంతే!

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్6 లోకి  ఆ జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే..
Bigg Boss 6
Follow us on

నాగ్ చెప్పినట్టే… లైఫ్లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్(Bigg Boss)తరువాతే! ఎంటర్‌టైన్మెంట్‌కు అడ్డాగా బిగ్ బాస్ మారిపోయినట్టే.! ఇది ఇప్పుడే కాదు.. బిగ్ బాస్ తెలుగులో ఎంట్రి ఇచ్చినప్పటి నుంచి ఇంతే! బుల్లితెరపై అన్‌లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంతే! ఇక ఇప్పటికే 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో… తాజాగా 6 వ సీజన్లోకి అడుగుపెట్టబోతోంది. మరి కొన్ని రోజుల్లో ఈ షో స్టార్ కానుంది. ఇక ఇదే విషయాన్ని చెప్పిన మా యాజమాన్యం… మొన్నటికి మొన్న ఈ షో నయా లోగో ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. నిన్ననిటి నిన్న ఈ షో ప్రోమోను కూడా రిలీజ్ చేసి… ఈ సారి బిగ్ బాస్ సరికొత్తగా ఉండబోతోందంటూ.. నాగ్ తోనే చెప్పించింది. ఇక బిగ్ బాస్ సీజన్‌ 6కు సంబంధించిన బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ రావడంతో… ఈ సారి బిగ్ బాస్ కు ఎవరు వెళ్లబోతున్నారనే ఈగర్ అందర్లో మొదలైంది. దాంతో పాటే ఆరా తీయడం కూడా స్టార్ట్‌ అయిపోయింది.

ఇక అకార్డింగ్ లేటెస్ట్ బజ్… ఈ షోలోకి కిర్రాక్ ఆర్పీ వెళుతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన ఆర్పీ.. మల్లెమాల మీద, ప్రొడ్యూసర్ శ్యామ్‌ ప్రసాద్‌ మీద తీవ్ర విమర్శలు చేశారు. తోటి కంటెస్టెంట్స్ సీక్రెట్స్ బయటి పెట్టి నెట్టింట వైరల్‌ అయ్యారు. దీంతో ఈ సారి కిర్రాక్ ఆర్పీ బిగ్ బాస్ సీసన్ 6కి వెళ్లడం ఖాయమని అంటున్నారు కొందరు. ఆర్పీ బిగ్ బాస్ లోకి వెళ్తే ఫన్ మరింత జనరేట్ అవుతుందని యాజమాన్యం భావిస్తోందట. తన ముక్కుసూటి తనంతో బిగ్ బాస్ గేమ్ ను మరింత రక్తికట్టిస్తాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి