
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం ఆట రసవత్తరంగా మారుతోంది. రోజురోజుకూ కొత్త మలుపులు, కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, నామినేషన్లతో హౌస్‌లో వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన అపూర్వ ప్రయాణం ఈ వారంతోనే ముగియనుందా.? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఐదో వారం నామినేషన్ల ప్రక్రియలో అపూర్వ పేరు ఎక్కువగా వినిపించింది. ముకేష్ గౌడ, త్రిగుణ్ లాంటి కంటెస్టెంట్లతో ఆమెకు ఎదురైన విభేదాలు నామినేషన్ల సమయంలో మరింత ఆసక్తిని పెంచాయి. కెప్టెన్సీ సమయంలో తన ప్రవర్తనపై వచ్చిన విమర్శలకు అపూర్వ కూడా గట్టిగానే సమాధానమిచ్చింది.
మరోవైపు, ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లకు ప్రేక్షకుల ఓట్లు కీలకంగా మారాయి. ఎవరు సేఫ్ అవుతారు? ఎవరి ప్రయాణం ముగుస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం అపూర్వతో పాటు ఝాన్సీ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఓటింగ్ అంచనాలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంటుంది.
అపూర్వకు ప్రేక్షకుల మద్దతు ఎంతవరకు లభిస్తుంది.? చివరి నిమిషంలో ఓటింగ్ ట్రెండ్ మారుతుందా.? ఆసక్తికరంగా మారింది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం కూడా వినిపిస్తున్నప్పటికీ, దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ అపూర్వకు తక్కువ ఓట్లు వస్తే ఆమె హౌస్‌ను వీడాల్సి రావచ్చు. అయితే ఇప్పటికే వినిపిస్తున్న దానిప్రకారం అపూర్వ ఆల్ మోస్ట్ ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తుంది. సోషల్ మీడియాలోనూ అపూర్వ ఎలిమినేట్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు హౌస్‌లో జరిగిన పరిణామాలు, నామినేషన్లలో ఎదురైన సవాళ్లు అపూర్వకు పరీక్షగా మారాయి. అందుకే ఈ వారం ఆమె ఎలిమినేషన్‌పై వస్తున్న వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.