
ఇరుముడి సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న కొమురం. ఇన్నాళ్లు కొమురక్కగా నవ్వించిన ఆయన.. ఇప్పుడు తనలోని అసలు సిసలు నటుడిని పరిచయం చేశారు. అయితే సినీ పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తయితే, సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం మరొక ఎత్తు. ఈ విషయంలో హాస్య నటుడు, ‘కొమరక్క’ ఫేమ్ కొమరం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారనే చెప్పాలి. ఇరుముడి మూవీ సక్సెస్ అయిన సందర్భంగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న కొమురం తన ఆస్తుల గురించి వినిపిస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన భూ పెట్టుబడులు, కష్టాలతో కూడిన జీవిత ప్రయాణం, నటనపై ఉన్న అపారమైన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రారంభ రోజుల్లో కొమరం ఎన్నో కష్టాలను అనుభవించారు. సిగ్నల్స్ వద్ద ఎఫ్.ఎం రేడియోలు, పర్సులు అమ్మడం నుంచి హోటళ్లలో ప్లేట్లు కడగడం వరకు నెలకు రూ. 750 సంపాదనతో తన ప్రయాణాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. ‘జబర్దస్త్’ , ఇతర షోల ద్వారా వచ్చిన గుర్తింపుతో సంపాదన పెరిగినప్పటికీ, జల్సాలకు దూరంగా ఉంటూ ప్రతి రూపాయిని పొదుపు చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..
టీవీలో యాంకర్‌గా పనిచేస్తున్న సమయంలో, సీనియర్ నటులు శోభన్ బాబు గారు భూములపై ఇన్వెస్ట్ చేయమని చెప్పిన మాటల నుంచి స్ఫూర్తి పొంది, రూ. 3.20 లక్షలతో మొదటిసారి ల్యాండ్ కొనుగోలు చేశారు. ఆ భూమి విలువ ఇప్పుడు రూ. 2 కోట్లకు పైగా పెరిగింది. మొత్తం 20 ఎకరాల భూమి ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో రూ. 200 కోట్ల ఆస్తి ఉందంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అది కేవలం వైరల్ అయిన ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. తనతో పాటు తోటి ఆర్టిస్టులకు కూడా భూముల్లో పెట్టుబడి పెట్టాలని ఎప్పుడూ సలహా ఇస్తుంటారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..
లేడీ గెటప్ (‘కొమరక్క’) వేసుకోవడం శారీరకంగా ఎంతో కష్టమైనప్పటికీ, ఆ పాత్ర ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుందని తెలిపారు]. మానసిక ప్రశాంతత కోసం, అనారోగ్యంతో ఉన్నవారు తన వీడియోలను చూసి కోలుకున్న సందర్భాలను గుర్తుచేసుకుంటూ కొమరం భావోద్వేగానికి లోనయ్యారు. నటన తన శ్వాస అని, చివరి శ్వాస వరకు ప్రేక్షకులను అలరిస్తూ నటుడిగానే కన్నుమూయాలన్నదే తన ఏకైక కోరిక అని కొమరం చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..