ఈ పాటలో కృష్ణ ఏకంగా 40కు పైగా డ్రెస్సులు మారుస్తారు.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్

350కు పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన సినిమాలు ఎంత హిట్ అయ్యాయో, ఆయన డ్యాన్సులు కూడా అభిమానులను అంతే ఊపు ఊపాయి. అలా ఓ సినిమా సాంగ్ లో హీరో కృష్ణ ఏకంగా నలబైకు పైగా డ్రెస్సులు ఛేంజ్ చేశారు..

ఈ పాటలో కృష్ణ ఏకంగా 40కు పైగా డ్రెస్సులు మారుస్తారు.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్
Krishna Movie Song

Updated on: Jun 06, 2026 | 5:51 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన జీవిత కాలంలో సుమారు 50 ఏళ్లు సినిమాల్లోనే జీవించారాయన. ఏకంగా 350 కు పైగా సినిమాల్లో నటించి లెజెండరీ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ అని చెప్పవచ్చు. ఒకే ఏడాది 18 సినిమాలు చేసి చరిత్ర సృష్టించిన కృష్ణ కలర్ సినిమాను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే హాలీవుడ్ కే పరిమితమైన కౌబాయ్ సినిమాలను కూడా మన తెలుగు ఆడియెన్స్ కు ఇంట్రడ్యూస్ చేశారాయన. కాగా కృష్ణ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. అయితే ఒక సినిమా మాత్రం కృష్ణకే కాదు ఆయన అభిమానులకు ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలిచిపోయింది. అది మరేదో కాదు అగ్ని పర్వతం. 1985లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ రివేంజ్ యాక్షన్ డ్రామాలో విజయ శాంతి , రాధ హీరోయిన్లుగా నటించారు. కైకాల సత్యనారాయణ, రావు గోపాల రావు, శారద తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా ధాటికి అదే సమయంలో రిలీజైన చిరంజీవి, బాలయ్య సినిమాలు అడ్రెస్ లేకుండా పోయాయి.

అగ్ని పర్వతం సినిమాలో కృష్ణ చెప్పిన డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా `అగ్గిపెట్టి ఉందా` అంటూ కృష్ణ అడిగే డైలాగ్ లకు ఆడియెన్స్ ఊగిపోయారు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఈ డైలాగ్ వినిపిస్తుంటుంది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ అంటే సాంగ్స్. ఇదే ఇదే రగులుతోన్న అగ్నిపర్వతం, ఈ గాలిలో, గోడదూకి వచ్చాను చందమామ, రావే ఇంగ్లీష్ రంభ, వయ్యారాలు సింగారాలు, వెయ్యి వెయ్యి చెయ్యి వెయ్యి నంబర్ వన్ సాంగ్స్ అన్నీ సూపర్ స్టార్ అభిమానులను ఒక ఊపు ఊపాయి.

కాగా అగ్ని పర్వతం సినిమాలోని వెయ్యి వెయ్యి చెయ్యి చెయ్యి నంబర్ వన్ కృష్ణ అభిమానులకు తెగ నచ్చేసింది. రాధ , కృష్ణల మీద ఉండే ఈ పాటలో కృష్ణ ఏకంగా నలభై డ్రెస్సులు మారుస్తాడు . ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ సాంగ్ హల్ చల్ చేస్తోంది. మరి మీరు కూడా ఈ సాంగ్ పై ఒక లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us