
Krishnam Raju Demise: కృష్ణంరాజు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కెరీర్ ప్రారంభంలో హీరోగా, విలన్‌గా మెప్పించిన ఆయన ఆతర్వాత సపోర్టింగ్ రోల్స్‌తో అదరగొట్టారు. భక్త కన్నప్ప, త్రిశూలం, పల్నాటి పౌరుషం, బొబ్బలి బ్రహ్మన్న తదితర సినిమాల్లో కృష్ణంరాజు నటనను చూసి అభిమానులు రెబల్‌స్టార్ అని ముద్దు పేరు పెట్టుకున్నారు. వందలాది చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన ఈ సీనియర్ నటుడు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. సినిమా ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కృష్ణం రాజు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
కాగా పేరులో రెబెల్ ఉన్నా కృష్ణం రాజు మనసు వెన్న అని ఆయన గురించి తెలిసిన వారెవరైనా చెబుతారు. కాగా గతేడాది కృష్ణంరాజు కుటుంబం తమ ఇంట్లో పనిచేస్తున్న పద్మను ఘనంగా సత్కరించింది. కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి గారైతే ఆమెకు ఓ బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పాతికేళ్లుగా తమ దగ్గరే పనిచేస్తున్న పనిమనిషిని కృష్ణంరాజు దంపతులు తమ సొంత ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారట. అందుకే ఆరోజు ఆమెను ఘనంగా సత్కరించి గోల్ట్ చైన్ గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇక ఇండస్ట్రీలో ఉన్న పెద్దలంతా కృష్ణంరాజు తన ఇంట్లో చేసే అతిథి మర్యాదల గురించి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన సినీ వారసుడు ప్రభాస్ కూడా అదే అలవాటు చేసుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..