Allu Arjun: అల్లు అర్జున్‌ హిట్‌ సినిమా విడుదలై 20 ఏళ్లు.. డ్యాన్స్, డైలాగ్స్‌కు యూత్‌ ఫిదా

'గంగోత్రి' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఐకాన్ స్టార్‌‌గా మారి అభిమానులను అలరిస్తున్నారు. తన యాక్టింగ్, డాన్స్ తో పాపులరిటీ తెచ్చుకున్నారు. ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ స్టైల్, లుక్ మెయింటైన్ చేస్తున్నారు.  

Allu Arjun: అల్లు అర్జున్‌ హిట్‌ సినిమా విడుదలై 20 ఏళ్లు.. డ్యాన్స్, డైలాగ్స్‌కు యూత్‌ ఫిదా
Icon Star Allu Arjun

Updated on: Jan 27, 2026 | 10:45 AM

పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్.. కెరీర్‌‌లో డిఫరెంట్ రోల్స్ చేసి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ హీరోగా అరంగేట్రం చేసి 23 ఏళ్లు గడిచింది. ఈ క్రమంలో ఆయన నటించిన సినిమాలు, స్టైల్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

అల్లు అర్జున్, జెనీలియా జంటగా నటించిన ‘హ్యాపీ’ సినిమా విడుదలై నేటికి 20 సంవత్సరాలు పూర్తయింది. 2006, జనవరి 27న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. బన్నీ, జెనీలియా కలిసి చేసిన అల్లరి యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. లవ్ స్టోరీతోపాటు భావోద్వేగాలు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. బన్నీ, జెనీలియా యాక్టింగ్, యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు హైలైట్స్ అని చెప్పవచ్చు.

Happy Movie Poster1

కరుణాకర్ దర్శకత్వంలో..

గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌పై లవ్ స్టోరీలను హృదయాలకు హత్తుకునేలా తీయడంలో ఎక్స్‌పర్ట్ అయిన కరుణాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మనోజ్ బాజ్‌పేయీ, దీపక్ షిర్కే, బ్రహ్మానందం, కిషోర్ , తనికెళ్ళ భరణి ఇతర ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే, బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయి వసూళ్లు రాబట్టలేదు. అయితే, అప్పట్లోనే బన్నీకి యూత్‌లో ఉన్న క్రేజ్‌, కరుణాకరన్ దర్శకత్వం కావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

2004లో విడుదలైన తమిళ చిత్రం అళగియ తీయే సినిమాకు రీమేక్‌గా హ్యాపీ సినిమాను తెరకెక్కించారు. రాధామోహన్ కథ అందించగా, కోన వెంకట్ డైలాగ్స్ అందించారు. అల్లు అర్జున్ స్టైల్, డైలాగ్ చెప్పే విధానం ఈ సినిమాలో డిఫరెంట్‌గా ఉంటాయి. బన్నీ డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. కాగా, అల్లు అర్జున్ నటించిన తర్వాత హ్యాపీ సినిమాను మలయాళంలోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా అక్కడ 175 రోజులు ప్రదర్శతమై రికార్డులు సృష్టించింది.