Viral Photo: చిరు ముందు డ్యాన్స్ చేస్తున్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టండి..

|

Jul 21, 2022 | 8:08 PM

తాజాగా మరో స్టార్ హీరో ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. మెగాస్టార్ చిరంజీవి ముందు ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి.

Viral Photo: చిరు ముందు డ్యాన్స్ చేస్తున్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టండి..
Viral
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరి రేర్ ఫోటోస్.. చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ వైరల్ అవుతుండగా.. వారెవరో గుర్తించేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కాజల్, రకుల్, సమంత, తాప్సీ, ఛార్మీ, విజయ్ దేవరకొండ, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో స్టార్ హీరో ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. మెగాస్టార్ చిరంజీవి ముందు ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్. యూత్‏లో యమ క్రేజ్.. అమ్మాయిల ఫేవరేట్. గుర్తుపట్టండి.

చిరు ముందు డ్యాన్స్ చేస్తున్న ఈ కుర్రాడు మరెవరో కాదండి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన బన్నీ.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టైలీష్ స్టార్‏గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‏గా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు బన్నీ. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేసింది. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా.. సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటించారు. ఆగస్ట్ చివరి వారంలో పుష్ప పార్ట్ 2 పట్టాలెక్కనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.