తెలుగు తెర మీద హీరోయిన్లు మరీ నల్లపూసలైపోతున్నారు. హీరోలంతా యాక్షన్ సినిమాల వైపు అడుగులేస్తుండటంతో హీరోయిన్లకు అసలు స్క్రీన్ స్పేసే దక్కటం లేదు. ముఖ్యంగా ఇన్నాళ్లు లవర్ బాయ్ వేషాలు వేసిన హీరోలు కూడా ఇప్పుడు యాక్షన్ మోడ్‌లోకి వచ్చేయటంతో.. హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమా అంటే హీరోయిన్ రోల్ పక్కాగా ఉండాల్సిందే అన్న ఫార్ములాను ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్షన్ సినిమాల హవా పెరుగుతుండటంతో నెమ్మదిగా హీరోయిన్ల స్క్రీన్ స్పేస్ తగ్గిపోతుంది. ముఖ్యంగా స్పై జానర్ ఎంచుకుంటున్న హీరోలు, హీరోయిన్స్‌ను ఆల్మోస్ట్ పక్కన పెట్టేస్తున్నారు.
అడివి శేష్ సినిమాల్లో హీరోయిన్ రోల్ జస్ట్ ఒకటి రెండు సీన్స్‌కే పరిమితమవుతోంది. మేజర్ సినిమాలో కథ పరంగా హీరోయిన్‌కు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. హిట్ 2లోనూ అదే పరిస్థితి. ఇక గూఢచారి సిరీస్‌లో అయితే హీరోయిన్ క్యారెక్టర్ నామమాత్రమే. తాజాగా నిఖిల్ కూడా ఇదే ట్రెండ్‌లోకి అడుగుపెడుతున్నారు. కార్తికేయ 2లో అనుపమా సినిమా అంతా కనిపించినా… కథ కరంగా రొమాంటిక్ సీన్స్‌కు స్కోప్‌లేదు. దీంతో అనుపమా ఓ క్యారెక్టర్‌గానే కనిపించింది. నెక్ట్స్ స్పై సినిమా కంప్లీట్‌గా యాక్షన్ జానర్ మూవీ కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్‌కు స్పేస్ ఉండే ఛాన్సే లేదు.
తాజాగా ఈ ట్రెండ్‌లోకి అడుగుపెడుతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రజెంట్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున సినిమాలో నటిస్తున్నారు వరుణ్. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పెద్దగా కనిపించేలా అయితే లేదు. ఇలా రొమాంటిక్ హీరోస్ అంతా యాక్షన్ ట్రెండ్‌లోకి వచ్చేస్తుండటంతో హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..