అబ్బాయిగా మారేందుకు ట్రైచేసిన మిల్కీ బ్యూటీ.. కానీ… అట్టర్ ప్లాప్ అయ్యిందే.. నవ్వులు పూయిస్తున్న వీడియో…
Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా.. ఓ వైపు సినిమాలు చేస్తునే.. మరో వైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పటివరకు ఎంతోమంది
Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా.. ఓ వైపు సినిమాలు చేస్తునే.. మరో వైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పటివరకు ఎంతోమంది అగ్రహీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమన్నా.. గోపీచంద్ నటిస్తున్న సీటీమార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది. గోపీచంద్ ఏపీకి కోచ్‌గా ఉంటే.. తమన్నా తెలంగాణ కోచ్‌గా కనిపించనుంది. ఈ సినిమాలో తమన్న సొంతంగా డబ్బింగ్ చెప్పిందట. ‘సీటీమార్’ ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ అమ్మడు అబ్బాయిగా మారేందుకు ట్రై చేసింది. కానీ అది సక్సెస్ కాదు కాద… అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమన్నా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ ప్రమోషన్లో భాగంగా.. మణిక్కమ్ అనే పాత్రలో కనిపించబోతుంది. అయితే ఇందులో మిల్కిబ్యూటీ గుబురు మీసాలతో కనిపించాలి. ఇందు కోసం రెడీ అవుతూ.. తమన్నా తెగ కష్టపడిపోయింది. మణిక్కమ్ పాత్ర కోసం మొత్తం రెడీ అయ్యాక మీసాలు కూడా పెట్టుకుంది. అయితే అవి వెంటనే కింద పడిపోయాయి. ఈ వీడియోను తమన్నా తన ఇన్ స్టాలో.. “మణిక్కమ్ వెనుక ఉన్న రహస్యం ఇదే” అంటూ షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీసాలు పెట్టుకున్న నువ్వు బానే ఉంటావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 2 లక్షల లైక్స్ వచ్చాయి. ఇక తమన్నా ప్రస్తుతం నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్‌లో నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ సరసన హీరోయిన్‌గా నభా నటేష్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు తమన్నా.. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ F2కు సీక్వెల్‌గా వస్తోన్న F3లో నటిస్తోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దీంతో పాటు తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తోంది. కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
Also Read: Hansika Motwani: హన్సిక ఇంట పెళ్లి సందడి.. అన్నయ్య పెళ్లిలో కుందనపు బొమ్మలా మెరిసిన హీరోయిన్..
Prakash Raj: ప్రకాష్ రాజ్‌తో కలిసి అల్లరి చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?