Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నటి రాశి గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత సినీరంగంలోకి రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు సీరియల్స్, సినిమాలు చేస్తూ మళ్లీ బిజీ అయ్యారు. తాజాగా తన డైట్స్, ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేసింది. ఇప్పుడు రాశి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
Raasi

Updated on: Jan 17, 2026 | 10:01 PM

హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఆమె.. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. సీరియల్స్, సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాశి వయసు 45 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతోపాటు ఫిట్నెస్, లుక్స్ తో ఆశ్చర్యపరుస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన డైట్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. బరువు తగ్గే విధానం గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కుమార్తె పాఠశాలకు వెళ్తున్న తరుణంలో, కుటుంబం తనను మిస్ అవుతుందని గ్రహించి, తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. డైట్, జిమ్, స్విమ్మింగ్ తన ఫిట్‌నెస్ రహస్యాలని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

రాశీ మాట్లాడుతూ.. “నేను అన్ని రకాలుగా పరిపూర్ణంగా ఉన్నప్పుడే సినిమాల్లోకి తిరిగి వస్తాను” అని అన్నకున్నానని.. ఇప్పుడు తాను సీరియల్స్ ద్వారా అలరిస్తున్నట్లు తెలిపారు. ఆమె బరువు తగ్గడం గురించి అడగగా, “వెయిట్ లాస్, డైట్ మాకు కొత్త కాదు” అని స్పష్టం చేశారు. హీరోయిన్‌గా ఉన్నప్పటి నుంచీ డైట్ చేయడం, జిమ్‌కు వెళ్లడం, స్విమ్మింగ్ చేయడం వంటివి తన దినచర్యలో భాగమని వివరించారు. తనను తాను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసుకున్న తర్వాతే కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..

ఉదయాన్నే 4.30 గంటలకు నిద్ర లేస్తానని యోగా, మెడిటేషన్, వాకింగ్ చేస్తానని అన్నారు. అలాగే జంక్ ఫుడ్ కాకుండా ఇంట్లో చేసిన వంటకాలనే తినడానికి ఇష్టపడతానని అన్నారు. ఇటీవల జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది రాశి.

ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..

ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?