Malvika Sharma: అందాల భామ చేతికి రక్తం.. విలవిలాడిపోయిన హీరోయిన్.. అసలేమైందంటే

| Edited By: Ravi Kiran

Feb 15, 2023 | 7:04 PM

హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Malvika Sharma: అందాల భామ చేతికి రక్తం.. విలవిలాడిపోయిన హీరోయిన్.. అసలేమైందంటే
Malvika Sharma (10)
Follow us on

సోషల్ మీడియా అందుబాటుకొచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇక సినిమా తారలకు సంబంధించిన విషయం అయితే జెట్ స్పీడ్ తో చక్కర్లు కొట్టిద్ది. తాజాగా ఒక హీరోయిన్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా క్రేజీ బ్యూటీ మాళవిక శర్మ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది హీరోయిన్స్ షూటింగ్ లలో గాయపడుతూ ఉంటారు. అలాగే మాళవికాకు కూడా గాయం అయ్యింది. కానీ షూటింగ్ లో కాదు.

మాళవిక షేర్ చేసిన వీడియోలో అమ్మడి చేతికి రక్తం .. నొప్పి తట్టుకోలేక విలవిలాడింది. ఇంతకు అసలు విషయం ఏంటంటే. ఈ అమ్మడికి వంట వండటం అంటే మహా ఇష్టమట. అయితే ఎక్కువగా వంట చేయదట. ఈ క్రమంలోనే కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయ్యింది. దాంతో నొప్పికి విలవిలలాడింది మాళవిక.

ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వేలు కట్ చేసుకున్నందుకే ఇంత హడావిడా అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మాకు చెప్తే మేము కట్ చేసే వాళ్ళం కదా.. ఇప్పుడు చూడండి ఏమైందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.