Aishwarya Rajesh: అతి మంచితనం అసలు పనికిరాదు.. నాన్నను చూశాకే తెలిసింది.. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్..

|

May 14, 2024 | 3:04 PM

తమిళంలో స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఐశ్వర్యకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. మంచి కథ వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించేందుకు రెడీగా ఉన్నానంటూ గతంలోనే చెప్పేసింది. ఇదంతా పక్కనపెడితే.. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను.. తల్లి పడ్డ బాధలను వివరించింది ఐశ్వర్య.

Aishwarya Rajesh: అతి మంచితనం అసలు పనికిరాదు.. నాన్నను చూశాకే తెలిసింది.. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్..
Aishwarya Rajesh
Follow us on

ఐశ్వర్య రాజేశ్.. అచ్చ తెలుగమ్మాయి. అయినా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఐశ్వర్య ఇప్పుడు కథానాయికగా వరుస సినిమాలు చేస్తుంది. గ్లామర్ పాత్రలు పక్కన పెట్టేసి కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను ఎంచుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‏గా నిలిచింది.. అతి చిన్నవయసులోనే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సహజనటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళంలో స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఐశ్వర్యకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. మంచి కథ వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించేందుకు రెడీగా ఉన్నానంటూ గతంలోనే చెప్పేసింది. ఇదంతా పక్కనపెడితే.. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను.. తల్లి పడ్డ బాధలను వివరించింది ఐశ్వర్య.

ఐశ్వర్య తండ్రి రాజేశ్ ఒకప్పుడు తెలుగులో హీరో. దాదాపు 54 సినిమాల్లో నటించాడు. కానీ ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే మృతి చెందాడు. రాజేశ్ మరణం తర్వాత అతడి కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం గురించి చెప్పుకొచ్చింది. కష్టాల్లో ఉన్నవారికి తన తండ్రి ష్యూరిటీ ఇచ్చి రుణాలు ఇప్పించారని.. కానీ అనారోగ్యంతో తన తండ్రి చనిపోయిన తర్వాత అప్పులు తీసుకున్నవారు తిరిగి చెల్లించలేదని తెలిపింది. దీంతే ఆ అప్పుల భారం మొత్తం తన తల్లిపై పడడంతో తమకు ఉన్న ఒకే ఒక్క ఫ్లాట్ ను విక్రయించి అప్పులు తీర్చిందని అన్నారు.

ఎన్నో కష్టాలు పడినా కూడా తమను మంచి స్కూల్లో చదివించి ఏలోటు లేకుండా తన తల్లి చూసుకుందని.. అన్నయ్యలు ఇద్దరూ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయడానికి రెడీ అయిన సమయంలో ప్రమాదంలో మరణించడంతో అమ్మను ఆ ఘటన మరింత కుంగదీసిందని తెలిపింది. ఎన్నో కష్టాలను ఎదుర్కోని నిలబడిన తన తల్లికి కొడుకులు ప్రమాదంలో మరణించినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపింది ఐశ్వర్య. ఇక తాను కూడా సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని.. ధైర్యంగా ముందుకు సాగే గుణాన్ని తన తల్లి నుంచి నేర్చుకున్నట్లు తెలిపింది. అతి మంచితనం పనికిరాదని తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది.