
కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాను షేక్ చేశాడు హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు యష్. ఆతర్వాత విడుదలైన కేజేఎఫ్ 2 సినిమా కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు యష్ నుంచి రాబోయే చిత్రం ‘టాక్సిక్’. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. మొన్నామధ్య టైటిల్ గ్లింప్స్. ఈ సినిమాలో అతని అద్భుతమైన నటన చూసి, అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చుద్ధామా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ సినిమా 2026లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుందని చెబుతున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక టీజర్ మాత్రం దుమ్మురేపిందనే చెప్పాలి.. యష్ లుక్స్, విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా యక్షన్స్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ టీజర్ ఇప్పుడు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ‘టాక్సిక్’ టీజర్ ఊహించని విధంగా ఉంది. మేకింగ్ హాలీవుడ్ స్టైల్ లో ఉంది. అలాగే యష్ మాసివ్ లుక్ కట్టిపడేస్తుంది. అలాగే ఈ సినిమాలో యష్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో కె.వి.ఎన్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను రెట్రో స్టైల్ లో రూపొందిస్తున్నారు. గీతుతో పాటు యష్ కూడా ఈ సినిమాకి కథ రాశారు. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. కేజీఎఫ్ చిత్రాల తర్వాత మరోసారి తన మాసివ్ లుక్, యాక్టింగ్ తో బ్లాస్ట్ చేస్తేందుకు రెడీ అయ్యారు యష్. KVN ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న“టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్”, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఒకేసారి విడుదల చేయనున్నారు మేకర్స్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి