Vijay Antony: సలాం విజయ్ ఆంటోని.. బిచ్చగాళ్లకు స్వయంగా వడ్డించిన హీరో
స్వయంగా బిర్యాని కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ అందించి మంచి మనసు చాటుకున్నారు. స్వయంగా బిక్షఘటన చేసుకునే వారికి ఇలా భోజనాలు వడ్డించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు విజయ్
రాజమండ్రిలో బిచ్చగాడు 2 ఫేమ్ హీరో విజయ్ అంటోని సందడి చేశారు. రాజమండ్రిలో భిక్షాటన చేసుకునే వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు హీరో విజయ్ ఆంటోని. స్వయంగా బిర్యాని కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ అందించి మంచి మనసు చాటుకున్నారు. స్వయంగా బిక్షఘటన చేసుకునే వారికి ఇలా భోజనాలు వడ్డించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు విజయ్
బిచ్చగాళ్ళతో కలిసి ఇలా హోటల్లో విందులో పాల్గొనడం చాలా హ్యాపీ గా ఉంది.. సినిమాలో జరిగే యదార్థ ఘటనను నిజ జీవితంలో బిక్షగాళ్లకు భోజనాలు వడ్డించడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. త్వరలో బిచ్చగాడు-3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. రాజమండ్రి రావడం ఇదే మొదటిసారి మరోసారి రాజమండ్రి వస్తాను అని తెలిపారు.
విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లలో బిచ్చగాడు 3 ఆడియన్స్ ముందుకు వస్తుందని తెలిపారు. అలాగే మరో మూడు సినిమాలు చేస్తున్నానని ఆయన టీవీ9 తో చెప్పారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ విజయాన్ని ఆడియన్స్ తో పంచుకోడానికి విజయయాత్రలో భాగంగా రాజమండ్రి స్వామి థియేటర్ కి ఫస్ట్ షో టైం కి వచ్చి సందడి చేశారు.