Srikanth: బడాహీరోకు భయపెట్టే పాత్ర ఇచ్చిన బోయపాటి.. జగ్గూభాయ్ బాటలో శ్రీకాంత్ కూడా..

ఒకప్పుడు హీరోగా రాణించిన వారంతా ఇప్పుడు విలన్స్‌గా మరి భయపెడుతున్నారు. కొంతమంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్నారు.

Srikanth: బడాహీరోకు భయపెట్టే పాత్ర ఇచ్చిన బోయపాటి.. జగ్గూభాయ్ బాటలో శ్రీకాంత్ కూడా..
Shrikanth

Updated on: Nov 16, 2021 | 10:29 AM

Srikanth: ఒకప్పుడు హీరోగా రాణించిన వారంతా ఇప్పుడు విలన్స్‌గా మరి భయపెడుతున్నారు. కొంతమంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక విలన్స్‌గా మారిన హీరోల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగపతి బాబు గురించే ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్‌గా మరి అదరగొట్టారు. ఆ సినిమా తరువాత జగపతిబాబు విలన్‌గా ఫుల్ బిజీ అయ్యారు. తెలుగుతోపాటు తమిళ్ సినిమాల్లోనూ విలన్‌గా నటించి మెప్పిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు హీరో శ్రీకాంత్. ఒకప్పుడు స్టార్ హీరోలకు పోటీగా నటించిన శ్రీకాంత్ ఇప్పుడు విలన్ గా మారారు. అదికూడా బాలయ్య సినిమా కోసమే.

గతంలో అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య నటించిన యుద్ధం శరణం సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా కనిపించారు. ఆ సినిమాతో ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు నట సింహం బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా కోసం శ్రీకాంత్ మరో సారి విలన్ అవతారమెత్తారు. అఖండ సినిమాలో శ్రీకాంత్ పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. 100కు పైగా సినిమాల్లో హీరోగా నటించిన శ్రీకాంత్ ఇక పై విలన్ గా మెప్పించడం ఖాయం అంటున్నారు కొందరు విశ్లేషకులు. మరి శ్రీకాంత్ కు కూడా జగపతి బాబు తరహా విలన్ పాత్రలు తలుపు తడతాయేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీనా మజాకా.. “భోళా శంకర్‌” కోసం భారీ సెట్స్ వేయిస్తున్న మెహర్ రమేష్..?

Balakrishna: నెట్టింట్లో బాలయ్య అభిమానుల హంగామా.. అఖండ పై అదిరిపోయే మీమ్స్‌..

Raj Tarun: సెక్యూరిటీ గార్డుల కష్టం ఈ సినిమా వల్ల నాకు తెలిసొచ్చింది.. రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Loading...
Unable to load recommendations.
Follow Us