Sivakarthikeyan: ‘మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం..ఆయనకి నా సినిమా విజయాన్ని అంకితం చేస్తున్నా’: శివకార్తికేయన్

|

May 20, 2022 | 8:14 AM

తమిళ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శివ కార్తికేయన్. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.

Sivakarthikeyan: మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం..ఆయనకి నా సినిమా విజయాన్ని అంకితం చేస్తున్నా: శివకార్తికేయన్
Sivakarthikeyan
Follow us on

తమిళ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శివ కార్తికేయన్(Sivakarthikeyan). ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. రెమో సినిమా తెలుగులోనూ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత శివ కార్తికేయన్ నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. చివరగా శివ కార్తికేయన్ నటించిన వరుణ్ డాక్టర్ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో.  రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కాలేజ్ డాన్'(Don) చిత్రం బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ తో సక్సెస్ జర్నీని కొనసాగించింది. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్ చిత్రం మే 13 న విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాత ఎన్వీ ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా మంచి విజయం సాధించడం తో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. కాలేజ్ డాన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన నిర్మాత ఎన్వీ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాలేజ్ డాన్ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. దర్శకుడు శిబి చక్రవర్తి మొదట స్క్రిప్ట్ వినిపించినపుడు ఈ కథ అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. మా నమ్మకం నిజమైయింది. వరుణ్ డాక్టర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. కాలేజ్ డాన్ కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తెలుగులో మాట్లాడాలని అనుకున్నాను.. తెలుగు అర్ధం అవుతుంది కానీ ఇంకా మాట్లాడే స్థితి రాలేదు అని అన్నారు. నెక్స్ట్ తాను అనుదీప్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను అని అన్నారు. అలాగే సముద్రఖని, ఎస్ జే సూర్య ఈ చిత్రాన్ని బలంగా నమ్మారు. గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. అనిరుద్ తో పాటు మిగతా సాంకేతిక నిపుణులు సినిమా కోసం అద్భుతంగా పని చేశారు. ఈ చిత్రంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నాకు రోల్ మోడల్. ఆయనకి ఈ చిత్ర విజయాన్ని అంకితం చేస్తున్నా అని శివ కార్తికేయన్ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anasuya Bharadwaj: నయా అందాలతో ఆకట్టుకుంటున్న అను లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Priyamani: ఆరెంజ్ డ్రెస్ లో మతిపోగుడుతున్న ప్రియమణి.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Deepika Padukone: కొర చూపులతో కవ్విస్తున్న బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ..