Tollywood: హీరో రవితేజ కూతుర్ని మీరెప్పుడైనా చూశారా..? అందాల కుందనపు బొమ్మ..

|

Apr 04, 2023 | 9:07 PM

సినీ ఇండస్ట్రీలో తన సొంత కష్టంతో స్టార్ హీరోలు ఎవరంటే.. ఠక్కున మొదట గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత మాస్ మహారాజా

Tollywood: హీరో రవితేజ కూతుర్ని మీరెప్పుడైనా చూశారా..? అందాల కుందనపు బొమ్మ..
Ravi Teja
Follow us on

సినీ ఇండస్ట్రీలో తన సొంత కష్టంతో స్టార్ హీరోలు ఎవరంటే.. ఠక్కున మొదట గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ అని ఎవరైనా చెప్తారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రవితేజ.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నటించారు. ఇక ‘నీకోసం’ చిత్రంతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు రవితేజ. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఎక్కడా కూడా అధైర్యపడకుండా.. ఆ తర్వాత కూడా లీడ్స్ రోల్స్ చేస్తూ వచ్చారు. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’.. లాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగారు రవితేజ. ఇక ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందరో యువ హీరోలకు రవితేజ సినీ ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుంది.

రవితేజ వెండితెర ప్రస్థానం అటుంచితే.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. రవితేజ అసలు పేరు రవి శంకర్ రాజు భూపతి రాజు. 2002లో తేజస్వి అనే అమ్మాయిని పెళ్లాడిన రవితేజకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. కొడుకు పేరు మహాదన్.. ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి.. అందరినీ మెప్పించాడు. ఇక కూతురు పేరు మోక్షద. ఈమె సోషల్ మీడియాలో కనిపించిందే తక్కువ. కానీ ఆమె అందాన్ని చూస్తే ఫిదా అవుతారు. అందాల కుందనపు బొమ్మే. కాగా, ప్రస్తుతం రవితేజ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.