Poorna: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ.. వైరల్ అవుతోన్న ఫొటో.
నటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గర్భం దాల్చిన తర్వాత షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన పూర్ణ దుబాయ్ వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం పూర్ణ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పూర్ణ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆసుపత్రి స్టాఫ్‌తో పాటు, భర్తతో కలిసిన దిగిన ఫొటోలను పంచుకున్న ఆమె..
నటి పూర్ణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గర్భం దాల్చిన తర్వాత షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన పూర్ణ దుబాయ్ వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం పూర్ణ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పూర్ణ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆసుపత్రి స్టాఫ్‌తో పాటు, భర్తతో కలిసిన దిగిన ఫొటోలను పంచుకున్న ఆమె.. మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు రాసుకొచ్చారు. తన గురించి ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉంటే పూర్ణ రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన పూర్ణ.. గతేడాది అక్టోబర్ వివాహం చేసుకున్నారు. కేరళకు చెందిన శనిద్ అసిఫ్ అలీని పూర్ణ పెళ్లాడింది. ఇతను దుబాయిలో ప్రముఖ వ్యాపార వేత్తగా పేరుని సంపాదించుకున్నాడు.
View this post on Instagram
వరుస సినిమాలతో నటించిన పూర్ణ అనంతరం.. బుల్లితెరపై కూడా జడ్జ్‌గా వ్యవహరించారు. ఇక తాను తాను తల్లి కాబోతున్నట్లు డిసెంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన దసరా మూవీలో సందడి చేసిన విషయం తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..