Rana Daggubati : ఆ స్టార్ హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పిన రానా.. కారణం ఇదే

రానా చివరిగా వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో కనిపించాడు. ఈ వెబ్ సిరీస్ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే సోలో హీరోగా చివరిగా విరాట పర్వం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లానాయక్ సినిమాలో నటించాడు. రీసెంట్ గా యంగ్ హీరో నిఖిల్ నటించిన స్పై మూవీలో చిన్న పాత్రలోకనిపించి ఆకట్టుకున్నాడు. అయితే రానా  నుంచి ఓ సాలిడ్ హిట్ మూవీ కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.

Rana Daggubati : ఆ స్టార్ హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పిన రానా.. కారణం ఇదే
Rana
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 16, 2023 | 9:52 AM

టాలీవుడ్ టాల్ హీరో రానా నుంచి కొత్త సినిమా అప్డేట్స్ రావడం లేదు దాంతో ఆయన ఫ్యాన్స్ అంతా కాస్త నిరాశతో ఉన్నారు. రానా చివరిగా వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో కనిపించాడు. ఈ వెబ్ సిరీస్ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే సోలో హీరోగా చివరిగా విరాట పర్వం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లానాయక్ సినిమాలో నటించాడు. రీసెంట్ గా యంగ్ హీరో నిఖిల్ నటించిన స్పై మూవీలో చిన్న పాత్రలోకనిపించి ఆకట్టుకున్నాడు. అయితే రానా  నుంచి ఓ సాలిడ్ హిట్ మూవీ కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇదిలా ఉంటే రానా ఓ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఆ హీరోయిన్ గురించి రానా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో రానా ఆ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పాల్సి వచింది.

రీసెంట్ గా రానా ఓ ప్రీరిలీజ్ ఈవెంట్ జూ గెస్ట్ గా హాజరయ్యాడు. దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత అనే సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాని , రానా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ..

దుల్కర్ పై ప్రశంసలు కురిపించాడు. దుల్కర్ నుంచి యాక్షన్ సినిమా వస్తుందంటే నేను చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా అని తెలిపాడు. అలాగే దుల్కర్ చాలా డౌన్ టూ ఎర్త్ అని ఓ ఉదాహరణగా.. బాలీవుడ్ లో దుల్కర్ ఓ సినిమాలో నటించాడు. ఆ సినిమా నిర్మాతలు నా స్నేహితులు కావడంతో ఆ మూవీ షూటింగ్ ను నేను వెళ్ళాను.. షాట్ మధ్యలో ఆ హీరోయిన్ ఫోన్ లో తన భర్తతో షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉంది. దుల్కర్ మాత్రం ఓపికగా అక్కడే ఎండలో నిలుచొని ఉండిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అంటూ కొందరు ఆమె పై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. దుల్కర్, సోనమ్ కలిసి ఓ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. రానా వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆమెకు రానా క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఓ ట్వీట్ ను షేర్ చేశాడు రానా.

సోనమ్ కు దుల్కర్ కు క్షమాపణలు చెప్తూ రానా ఓ ట్వీట్ ను షేర్ చేశాడు.

సోనమ్ కపూర్ దుల్కర్ కలిసి జోయా ఫ్యాక్టర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది .

దుల్కర్ నటిస్తున్న ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ కింగ్ ఆఫ్ కోత. ఈ సినిమా పై ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!