Nithiin: టాలీవుడ్ లో దూసుకుపోతున్న కుర్ర హీరోల్లో టాలెంటెడ్ యాక్టర్ నితిన్ ఒకరు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు నితిన్. ఇటీవలే భీష్మ , రంగ్ దే సినిమాలత్వ్ హిట్స్ అందుకున్న నితిన్ ఇప్పుడు మాచర్ల నియోజక వర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ సినిమాతో ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. విభిన్న కథ కథనంతో రూపొందుతున్న `మాచర్ల నియోజకవర్గం మూవీలో`కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేసారు.
ఇక రీసెంట్ గా `మాచర్ల నియోజకవర్గం` ఫస్ట్ ఛార్జ్ పేరుతో ఫస్ట్ లుక్ ను మేకర్స్ ప్రేక్షకులకు అందించారు. ఇటీవల వినూత్నం గా మార్చి 26న ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్నట్లుగా ప్రభుత్వ ఉత్తర్వు శైలిలో ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారి యొక్క కింది పోస్ట్ తక్షణమే అమలులోకి వస్తుంది – శ్రీ ఎన్ . సిద్ధార్థరెడ్డి, IAS (2022) గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. తన మొదటి ఛార్జ్‌ని మార్చి 26న ఉదయం 10:08 గంటలకు తీసుకుంటున్నారు. అంటూ ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. తాజాగా ఈ సినిమానుంచి నితిన్ లుక్ ను రిలీజ్ చేశారు. గుంటూరులో జిల్లా కలెక్టర్ గా కథానాయకుడు ఎదుర్కోబోయే సవాళ్లను చూపించనున్నారు ఈ మూవీలో. రాజకీయ నేపథ్యంతో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. ఇక భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్ తో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :