Adipurush Movie : ప్రభాస్‌‌‌కు తల్లిగా ఒకప్పటి అందాల తార.. ‘ఆదిపురుష్‌‌‌‌‌‌’లో ఆ బాలీవుడ్ హీరోయిన్..

|

Feb 10, 2021 | 3:55 AM

రామాయ‌ణ ఇతిహాస గాథ ఆధారంగా ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రైత్ ఆది పురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Adipurush Movie : ప్రభాస్‌‌‌కు తల్లిగా ఒకప్పటి అందాల తార.. ఆదిపురుష్‌‌‌‌‌‌లో ఆ బాలీవుడ్ హీరోయిన్..
Follow us on

Adipurush Movie  : రామాయ‌ణ ఇతిహాస గాథ ఆధారంగా ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రైత్ ఆది పురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.   ఆదిపురుష్‌‌ను రూ.400 కోట్ల బడ్జెట్‌‌తో తీయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటి నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాముడి తల్లిగా బాలీవుడ్ నటి అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని నటించనుందని అంటున్నారు. ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది కాబట్టి బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్.. కౌసల్య పాత్రను హేమమాలిని మాత్రమే పోషించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆదిపురుష్ సినిమాను ఆగ‌స్ట్ 11, 2022న విడుద‌ల చేయ‌నున్నట్లు మూవీ మేకర్స్ అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Kriti Sanon : ఇంతకు ముందు ఎప్పుడు చేయని పాత్ర ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం చేస్తానంటున్న బ్యూటీ..