
తెలుగు సినిమా చరిత్రలో ది బెస్ట్ విలన్‌ల లిస్ట్ తీస్తే అందులో ప్రదీప్ రావత్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళ్ భాషల్లోనూ అదరగొట్టాడీ ఫేమస్ నటుడు. సినిమాల్లోకి రాకముందు కొన్ని సీరియల్స్ లో నటించాడు ప్రదీప్. ముఖ్యంగా బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహా భారత్ టీవీ సిరీస్ లో అతను పోషించిన అశ్వత్థామ పాత్ర నటుడికి మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగు సినిమాల్లోకి రాకముందు పలు హిందీ సినిమాల్లో నటించాడు ప్రదీప్. ఆమిర్ ఖాన్ లగాన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లోనూ భాగమయ్యాడు. ఇక 2004లో రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారీ నటుడు. ఇందులో అతను పోషించిన భిక్షు యాదవ్ పాత్ర ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజం చెప్పాలంటే సై సినిమాతో హీరోకు మించిన క్రేజ్ విలన్ రోల్‌కు వచ్చింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రదీప్ రావత్. దీని తర్వాత రావత్ కు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా అవకాశాలొచ్చాయి.
భద్ర, అందరివాడు, ఛత్రపతి, లక్ష్మీ,స్టాలిన్, దేశముదురు, యోగి, గజినీ, మస్కా, రగడ, రాజన్న, రెబెల్, నాయక్, నేనొక్కడినే, లయన్, సరైనోడు, నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేర్ వీరయ్య తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు ప్రదీప్. కేవలం విలన్ గానే కాదు… ఓయ్, పూలరంగడు, నేను శైలజా, సరైనోడు వాల్తేర్ వీరయ్య తదితర సినిమాల్లో కామెడీని కూడా అద్బుతంగా పండించాడు ప్రదీప్.
ఇదిలా ఉంటే ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు ప్రదీప్ రావత్. ఆయన చివరిగా 2023లో వాల్తేర్ వీరయ్య సినిమాలో కనిపించాడు. సినిమాల సంగతి తప్పితే ప్రదీప్ రావత్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు… ఈ నటుడి భార్య పేరు కల్యాణి. పేరు చూస్తే తెలుగమ్మాయిలా ఉంది అనుకున్నారా? అవును.. ఈ నటుడి భార్య తెలుగమ్మాయే. ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ రావతే స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇక కళ్యాణి పెద్దగా బయటకు కనిపించదు. కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి బయట కనిపిస్తుంటుంది. కల్యాణితో సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి అనుబంధం లేకపోయినా ఆమె చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్‌లకు ఏ మాత్రం తీసిపోదు అనేలా ఉంటుంది. అప్పుడప్పుడు ప్రదీప్ రావత్- కల్యాణిల ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.