
టాలీవుడ్‌లో ఒకప్పుడు యాక్షన్ క్వీన్‌గా, స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి వాణి విశ్వనాథ్. ‘ఘరానా మొగుడు’, ‘కొదమ సింహం’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి మెప్పించారు. ఆ తర్వాత గ్లామర్ పాత్రలతో పాటు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో లేడీ అమితాబ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, తాజాగా ఈ సీనియర్ నటికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె వారసురాలు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. వాణి విశ్వనాథ్ కుమార్తె వర్షా విశ్వనాథ్ ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఇటీవల వైవిధ్యమైన టైటిల్‌తో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మటన్ సూప్’ సినిమాలో వర్షా విశ్వనాథ్ హీరోయిన్‌గా నటించి తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..
ఒక వైపు క్యూట్ లుక్స్‌తో, మరోవైపు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అమ్మకు తగ్గ కూతురు అనిపించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే నటిగా తనలోని ప్రతిభను చాటుకుని, టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. నిజానికి వాణి విశ్వనాథ్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందలాది సినిమాలు చేసి అప్పట్లో అగ్ర నటిగా నిలిచారు. ఇప్పుడు ఆమె కూతురు కూడా అదే బాటలో బహుభాషా నటిగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. ‘మటన్ సూప్’ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులకు మొదట్లో వర్ష.. వాణి విశ్వనాథ్ కూతురనే విషయం తెలియదు. కానీ ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Vantalakka: నా భర్త నాతో కలిసి ఉండడు.. కారణం అదే.. కార్తీక దీపం వంటలక్క కామెంట్స్..
“అచ్చం అమ్మలాగే చాలా అందంగా ఉంది, భవిష్యత్తులో టాలీవుడ్‌లో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అమ్మ అండదండలతో పాటు, స్వయంకృషితో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న వర్షా విశ్వనాథ్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో అలరించడానికి సిద్ధమవుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..
వాణి విశ్వనాథ్ కూతురు..
ఎక్కువ మంది చదివినవి : ఏంటీ.. ఈ నటుడు వైఎస్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఆ.. ? సినిమాలకు బలవంతంగా తీసుకెళ్లేవారట.