
పెళ్లయ్యాక సినిమాలు బాగా తగ్గించేసింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఆమె కంటెంట్ బేస్డ్ సినిమాలు మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం ఎక్కువ సమయం తన ఫ్యామిలీకే కేటాయిస్తోంది. ముఖ్యంగా కుమారుడు ‘వాయువ్ తేజ్ కొణిదెల’ ఆలనా పాలనా చూసుకుంటూ బిజి బిజీగా ఉంటోంది. సినిమాలు తగ్గించేసినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది లావణ్య. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫ్యామిలీ ఈవెంట్స్, ఫంక్షన్స్ కు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకుంటోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది లావణ్య. తన సోదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో కలిసున్న ఒక క్యూట్ ఫొటోను షేర్ చేసిన ఈ మెగా కోడలు .. ‘ నా ప్రియమైన అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు! నువ్వు కేవలం సోదరి మాత్రమే కాదు. నా జీవితానికి మార్గదర్శివి. నన్ను అమ్మలా చూసుకున్నావు. స్నేహితురాలిలా తోడుగా నిలిచావు. నువ్వు మా జీవితంలో ఉండటం మా అదృష్టం’ అంటూ అక్కపై తన ప్రేమకు అక్షర రూపమిచ్చింది లావణ్య.
ప్రస్తుతం మెగా కోడలు షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కాగా లావణ్య త్రిపాఠికి ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. సోదరుడి పేరు సిద్ధార్థ్ రతన్ త్రిపాఠి. ఇక అక్క పేరు శివాని త్రిపాఠి. ప్రస్తుతం ఈమె స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా కీలకమైన భాద్యతలు నిర్వహిస్తోంది.
కాగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న లేటెస్ట్ సనిమా ‘సతీ లీలావతి’. తాతినేని సత్య తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో లావణ్యకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.