Ashwini Nachappa: అమ్మబాబోయ్.. పరుగుల రాణి అశ్విని నాచప్ప కూతుర్లు ఎంత అందంగా ఉన్నారో తెలుసా..?

అశ్విని క్రీడాకారిణిగానే కాకుండా నటిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అశ్విని అనే సినిమాలో నటించారు ఆమె. ఆ సినిమాలో కూడా క్రీడాకారిణిగా నటించారు.

Ashwini Nachappa: అమ్మబాబోయ్.. పరుగుల రాణి అశ్విని నాచప్ప కూతుర్లు ఎంత అందంగా ఉన్నారో తెలుసా..?
Ashwini nachappa

Updated on: Jan 11, 2023 | 11:40 AM

పరుగుల రాణిగా ఆమె పేరుమీద ఓ రికార్డ్ ఉంది.. లక్ష్యానికి గురిపెట్టిన బాణంగా దూసుకుపోయే ఆమె పేరు అశ్విని నాచప్ప.  అశ్విని క్రీడాకారిణిగానే కాకుండా నటిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అశ్విని అనే సినిమాలో నటించారు ఆమె. ఆ సినిమాలో కూడా క్రీడాకారిణిగా నటించారు. స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యాక కరోబయ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు అశ్విని నాచప్ప . కర్ణాటక రాష్ట్ర కూర్గ్ ప్రాంతానికి చెందిన అశ్విని. మహిళల పరుగుపందెములో 80వ దశకపు తొలినాళ్లలో పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా పేరు తెచ్చుకున్నారు. అలాగే 1988లో అర్జున అవార్డు ను అందుకున్నారు. క్రీడారంగం నుంచి విరమించిన తర్వాత 1994, అక్టోబర్ 2 న ఇండియన్ ఏయిర్‌లైన్స్ జట్టు హాకీ ఆటగాడు దత్త కరుంబయ్యను వివాహం చేసుకున్నారు.

ఇక అశ్వినికి ఇద్దరు ఆడపిల్లలు.. వారి పేర్లు అనీషా, దీపాలీ. ఇక దర్శకుడు చంద్రమౌళి తెరకెక్కించిన అశ్విని సినిమా తర్వాత ఆదర్శం అనే సినిమాలోనూ నటించారు అశ్విని. ఇక అశ్విని కూతుర్లలో అనీషా కూడా బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్రస్థాయిలో మంచి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

చిన్నమ్మాయి దీపాలి కూడా గోల్ఫ్ ప్లేయర్ గా కొనసాగుతోంది. తన ఇద్దరు పిల్లలతో పాటు మరికొంతమంది ఆడపిల్లలను కూడా శిక్షణ ఇస్తున్నారు. తాజాగా అశ్విని నాచప్ప కూతుర్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆడపిల్లలు చదువుతోపాటు క్రీడలు కూడా రాణించాలని చెప్తూ ఉంటారు అశ్విని నాచప్ప.

ఇవి కూడా చదవండి

Ashwini Nachappa

 

Loading...
Unable to load recommendations.
Follow Us