చాలా కాలంగా సాయి పల్లవినుంచి ఎలాంటి మూవీ ఆప్డేట్ రావడం లేదు. దాంతో అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా సాయి పల్లవి. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీఇచ్చింది. టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా ఎదిగింది సాయి పల్లవి. ఆమెకు మన దగ్గర మాములు ఫాలోయింగ్ ఉండదు. స్కిన్ షో కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది సాయి పల్లవి. ఇక గత ఏడాది సాయి పల్లవి విరాట పర్వం, లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత గార్గి అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఆమె మరో సినిమా కమిట్ అవ్వలేదు. తాజాగా సాయి పల్లవి ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది.
తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అజిత్ ఇటీవలే తునీవు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అజిత్ నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.
లైకా ప్రొడక్షన్స్ లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో అజిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. గతంలో ఈ సినిమాలో హీరోయిన్ కోసం రకరకాల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఫైనల్ గా సాయి పల్లవి పేరు ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.